భారత్ జట్టులో సిరాజ్‌కు చోటు దక్కకపోవడంపై రాజకీయ దుమారం..!
ABN , Publish Date - Nov 20 , 2026 | 01:52 PM
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తుది జట్టులో పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే. సిరాజ్‌తో పాటు జడేజా విషయంలో టీమిండియా సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి లాంటి మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక సిరాజ్‌కు జట్టులో చోటు దక్కకపోవడం రాజకీయ అంశంగా మారింది.
స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తుది జట్టులో పేసర్ మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే. సిరాజ్‌తో పాటు జడేజా విషయంలో టీమిండియా సెలక్టర్లు తీసుకున్న ఈ నిర్ణయంపై సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి లాంటి మాజీ క్రికెటర్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక సిరాజ్‌కు జట్టులో చోటు దక్కకపోవడం క్రికెట్ నుంచి రాజకీయ అంశంగా మారింది. ప్రస్తుతం సిరాజ్ విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గతంలో అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ, అతడి పేరు కారణంగానే జట్టులోకి తీసుకోలేదంటూ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ సంచలన ఆరోపణలు చేశారు. 'మంచి ప్రదర్శన ఉన్నా జట్టులో చోటు ఇవ్వలేదంటే వివక్ష స్పష్టంగా కనిపిస్తోంది' అని ఆయన విమర్శించారు.
ఇమ్రాన్ మసూద్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. క్రికెట్ జట్టు ఎంపికలోనూ కాంగ్రెస్ ఓటు బ్యాంకు, మత రాజకీయాలు చేస్తోందని బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారీ మండిపడ్డారు. 'సిరాజ్ మైనారిటీ కావడం వల్లే పక్కనపెట్టారని కాంగ్రెస్ అంటోంది. మరి జడేజాను కూడా పక్కనపెట్టారు కదా!. మరి..దీనికి ఏం చెబుతారు. ప్రతి ఆటగాడు దేశం కోసం ఆడతాడు. రాజకీయాల కోసం జట్టును విభజించడం సిగ్గుచేటు' అని భండారీ సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు.
మరోవైపు వెల్లింగ్టన్ టెస్టులో జస్ప్రీత్ బుమ్రాతో పాటు అన్షుల్ కాంబోజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్‌లకు అవకాశం ఇవ్వడాన్ని టీమిండియా సహాయ కోచ్ సితాంశు కోటక్ సమర్థించుకున్నారు. పిచ్ పరిస్థితులు, మ్యాచ్ అన్ని రోజుల వ్యూహాన్ని దృష్టిలో ఉంచుకునే అత్యుత్తమ తుది జట్టును ఎంపిక చేశామని, సిరాజ్ విషయంలో ఎలాంటి పొరపాటు జరగలేదని ఆయన స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి:
'అతిపెద్ద ద్రోహి'.. ఖవాజాపై సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ డివిలియర్స్ ఆగ్రహం!
ధోని ఆటకు పాక్ అధ్యక్షుడు ముషారఫ్ ముగ్దులయ్యారు: శుక్లా