క్రికెట్ చరిత్రలో సంచలనం.. అరంగేట్రంలోనే వరల్డ్ రికార్డ్
ABN , Publish Date - Aug 14 , 2026 | 07:30 PM
స్కాట్లాండ్ యువ బౌలర్ లైల్ రాబర్ట్‌సన్ తన అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్ 2లో భాగంగా కెనడాతో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేసిన రాబర్ట్‌సన్.. అద్భుత ప్రదర్శనతో అందరిని ఆకట్టుకున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: స్కాట్లాండ్ యువ ఆటగాడు లైల్ రాబర్ట్‌సన్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను ఘనంగా ఆరంభించాడు. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్-2లో భాగంగా డండీ వేదికగా కెనడాతో జరిగిన మ్యాచ్‌లో రాబర్ట్‌సన్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఈ ఏకపక్ష పోరులో రాబర్ట్‌సన్ బంతితో మ్యాజిక్ చేశాడు. అంతేకాక ప్రపంచ రికార్డును క్రియేట్ చేశాడు.
తన 10 ఓవర్ల కోటాలో 52 పరుగులిచ్చి ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. తద్వారా వన్డేల్లో అరంగేట్ర మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన స్పిన్నర్‌గా రాబర్ట్‌సన్ చరిత్ర సృష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్థాన్ స్పిన్నర్ అరాఫత్ మిన్హాస్ పేరిట ఉండేది. అతడు 32 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు సాధించాడు. తాజాగా కెనడాతో జరిగిన ఈ మ్యాచ్‌తో అరాఫత్ రికార్డును 23 ఏళ్ల రాబర్ట్‌సన్ బ్రేక్ చేశాడు. మొత్తంగా వన్డే డెబ్యూలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్‌గా కగిసో రబాడ వంటి దిగ్గజాలు సరసన ఈ స్కాటిష్ స్పిన్నర్ నిలిచాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 కోల్పోయి 347 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం 348 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కెనడాను 177 పరుగులకే కుప్పకూలింది. కెనడా ఓటమిలో రాబర్ట్‌సన్ కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా స్కాట్లాండ్ 170 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో స్కాట్లాండ్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.
ఇవి కూడా చదవండి:
రైల్వే జేఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఇదే నా చివరి ప్రపంచకప్ కావొచ్చు: మన్‌ప్రీత్ సింగ్