Share News

ఆష్లే గార్డనర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా మద్దతు.. వైస్ కెప్టెన్‌గా కొనసాగింపు!

ABN , Publish Date - Aug 14 , 2026 | 05:46 PM

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డనర్ కొనసాగింపుపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టత నిచ్చింది. గార్డనర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలు చెలరేగినప్పటికీ, బోర్డు యాజమాన్యం ఆమె నాయకత్వ పాత్రకు మద్దతుగా నిలిచింది.

ఆష్లే గార్డనర్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా మద్దతు.. వైస్ కెప్టెన్‌గా కొనసాగింపు!
Ashley Gardner

స్పోర్ట్స్ డెస్క్: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ ఆష్లే గార్డనర్ తన సహచర క్రీడాకారిణి జార్జియా వోల్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్నారని తన భార్య మోనికా రైట్ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ అనైతిక బంధం తాము విడిపోవడానికి దారితీసిందని రైట్ పేర్కొంది. నాయకత్వ హోదాలో ఉన్న ఆటగాళ్లపై బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే, ఈ అంశంపై క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ టాడ్ గ్రీన్ బర్గ్ స్పందిస్తూ.. గార్డనర్ వైస్ కెప్టెన్సీ స్థానంపై బోర్డు సమావేశంలో చర్చించామని, ఆ పదవిలో ఆమె కొనసాగేందుకే మొగ్గు చూపినట్లు తెలిపారు.


ఆటగాళ్ల మధ్య సంబంధాలు జట్టు ఎంపికల్లో లేదా వాతావరణంలో ఎలాంటి ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతో 'రెస్పెక్ట్ ఎట్ వర్క్' (Respect at Work) పాలసీలో సీఏ కొన్ని కీలక మార్పులు చేసింది. వైస్ కెప్టెన్ అయినప్పటికీ తుది జట్టు ఎంపికలో గార్డనర్‌కు ఎలాంటి ఓటింగ్ లేదా నిర్ణయాధికారం ఉండదు.


అలానే జార్జియా వోల్ ఎంపిక, జట్టులో స్థానం లేదా ప్రదర్శన గురించి గార్డనర్ సెలెక్టర్లతో గానీ, ఇతరులతో గానీ ఎలాంటి చర్చలు జరపకూడదని సీఏ అధికారులు ఆదేశించారు. జట్టు సభ్యుల మధ్య ఎలాంటి అపోహలు లేదా అసౌకర్యం రాకుండా నివారించడమే లక్ష్యమని, మిగిలిన అంశాలను వ్యక్తిగత విషయంగానే పరిగణిస్తున్నామని బోర్డు స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి:

ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత

అకస్మాత్తుగా ఇంటికి పోలీసులు.. షాకైన అశ్విన్

Updated Date - Aug 14 , 2026 | 06:15 PM