Share News

ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత

ABN , Publish Date - Aug 14 , 2026 | 04:52 PM

ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో స్టార్క్ ఆరో స్ధానానికి చేరాడు.

ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ అరుదైన ఘనత
Mitchell Starc

స్పోర్ట్స్ డెస్క్: డార్విన్ వేదికగా ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఓ అరుదైన మైలు రాయిని అందుకున్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో స్టార్క్ ఆరో స్థానానికి ఎగబాకాడు. బంగ్లా ప్లేయర్ లిట్టన్ దాస్ వికెట్‌తో స్టార్క్ ఈ ఫీట్ సాధించాడు.


స్టార్క్ ఇప్పటి వరకు తన టెస్ట్ కెరీర్‌లో 106 మ్యాచ్‌లు ఆడి 435 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలోనే భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్(434)ను మిచెల్ అధిగమించాడు. మరో నాలుగు వికెట్లు పడగొడితే డేల్ స్టైయిన్(439) రికార్డును కూడా దాటేసి టాప్-5లోకి అతడు అడుగుపెడతాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఎడమ చేతి వాటం బౌలర్‌గా స్టార్క్ నే కొనసాగుతున్నాడు. ఇకఓవరాల్‌గా టెస్టు ఫార్మట్‌లో ఎక్కువ వకెట్లు తీసిన పేసర్ల జాబితాలో జేమ్స్ అండర్సన్(704) నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.


ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆతిథ్య ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్‌ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి బంగ్లాదేశ్ 110 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల న‌ష్టానికి 351 ప‌రుగులు చేసింది. బంగ్లా జట్టు ప్రస్తుతం 153 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 198 పరుగుల స్వల్ప స్కోర్కే ఆలౌటైన సంగతి తెలిసిందే.


టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్లు:

  • జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లండ్) – 704

  • స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్) – 604

  • గ్లెన్ మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) – 563

  • కోర్ట్నీ వాల్ష్ (వెస్టిండీస్) – 519

  • డేల్ స్టెయిన్ (సౌతాఫ్రికా) – 439

  • మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) – 435*

  • కపిల్ దేవ్ (భారత్) – 434


ఇవి కూడా చదవండి:

రేపు శ్రీలంకతో పోరుకు భారత్ రెడీ.. గిల్ కీలక వ్యాఖ్యలు

అకస్మాత్తుగా ఇంటికి పోలీసులు.. షాకైన అశ్విన్

Updated Date - Aug 14 , 2026 | 05:03 PM