రేపు శ్రీలంకతో పోరుకు భారత్ రెడీ.. గిల్ కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Aug 14 , 2026 | 02:59 PM
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 సీజన్‌లో భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. రేపటి(శనివారం) నుంచి శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడనుంది.
స్పోర్ట్స్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27 సీజన్‌లో భారత్ మరో కీలక పోరుకు సిద్ధమైంది. రేపటి(శనివారం) నుంచి శ్రీలంకతో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా మోకాలి గాయంతో ఈ సిరీస్‌కు దూరం కాగా, సీనియర్ పేసర్ మహమ్మద్ సిరాజ్‌తో కలిసి కొత్త బంతిని పంచుకునేందుకు ప్రసిద్ధ్ కృష్ణ, యువ పేసర్ గుర్నూర్ బ్రార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ఈ ఎంపిక క్లిష్టమైన నిర్ణయమని గిల్ అంగీకరించాడు. గుర్నూర్ పాత బంతితో మంచి వేగంతో బౌన్స్ రాబట్టగలడని, అయితే వార్మప్ మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ ఆకట్టుకున్నాడని అతడు తెలిపాడు. బుమ్రా లేకపోవడం ఆ స్థానంలో యువ ఆటగాళ్లకు తమ సత్తా నిరూపించుకోవడానికి మంచి అవకాశమని గిల్ పేర్కొన్నాడు. ఇక స్పిన్ విభాగానికి వస్తే.. ఇద్దరు ఎడమచేతి వాటం స్పిన్నర్లు రవీంద్ర జడేజా, మానవ్ సుతార్‌లతో పాటు చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్‌లు బరిలోకి దిగడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
'భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం నాకొక బాధ్యతాయుతమైన అనుభూతి. భారత్ ఆడబోయే 600వ మైలురాయి టెస్టుకు, అదీ స్వాతంత్య్ర దినోత్సవం రోజున నాయకత్వం వహించడం నాకు దక్కిన గొప్ప గౌరవం' అని గిల్ వ్యాఖ్యానించాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ రేసులో నిలవాలంటే రాబోయే రోజుల్లో 6 నుంచి 7 టెస్టులు గెలవాల్సి ఉందని, దీంతో ఈ సిరీస్ నుంచే విజయావకాశాలను బలపరచుకోవాలని తమ జట్టు పట్టుదలతో ఉందని గిల్ వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి: