Share News

నెట్స్‌లో జోరుగా..

ABN , Publish Date - Aug 14 , 2026 | 05:29 AM

శ్రీలంకతో జరుగబోయే తొలి టెస్టు కోసం భారత్‌ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఈనెల 15న గాలె అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్‌ ఆరంభం కానుంది. ఈనేపథ్యంలో గురువారం ఉదయం...

నెట్స్‌లో జోరుగా..

తొలి టెస్టు సన్నాహకాల్లో భారత్‌

గాలె: శ్రీలంకతో జరుగబోయే తొలి టెస్టు కోసం భారత్‌ ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఈనెల 15న గాలె అంతర్జాతీయ స్టేడియంలో ఈ మ్యాచ్‌ ఆరంభం కానుంది. ఈనేపథ్యంలో గురువారం ఉదయం నుంచే భారత ఆటగాళ్లంతా గాలె మైదానంలో చెమటోడ్చారు. ఫుట్‌బాల్‌, ఫీల్డింగ్‌ డ్రిల్స్‌తో పాటు ఆటగాళ్లు బ్యాటింగ్‌, బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించారు. అలాగే కోచ్‌ గంభీర్‌, కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ పిచ్‌ను పరిశీలించారు. అటు ప్లేయర్లు ముందుగా ఫీల్డింగ్‌ కోచ్‌ శుభదీప్‌ ఘోష్‌ ఆధ్వర్యంలో ఒంటి చేత్తో క్యాచ్‌లను అందుకోవడం ప్రాక్టీస్‌ చేశారు. ఆ తర్వాత పక్కనే ఉన్న మరో నెట్స్‌ దగ్గరికి వెళ్లిన ఓపెనర్‌ జైస్వాల్‌, రాహుల్‌ స్పిన్‌, పేస్‌, త్రోడౌన్‌ బంతులను ఎదుర్కొన్నారు. పంత్‌, జురెల్‌, దేవ్‌దత్‌, సర్ఫరాజ్‌ సైతం బ్యాట్లకు పనిచెప్పారు. పేసర్లు సిరాజ్‌, ప్రసిద్ధ్‌లతో పాటు స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ వీరికి బంతులు వేశారు. మరోవైపు పంత్‌ టెన్నిస్‌ బాల్‌తో కీపింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు.

స్పిన్‌ ద్వయంతో సవాల్‌

గాలె అంతర్జాతీయ స్టేడియంలో శ్రీలంక స్పిన్నర్లు ప్రభాత్‌ జయసూర్య, రమేశ్‌ మెండి్‌సలకు అద్భుతమైన రికార్డు ఉంది. ఈ మైదానంలో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టేందుకు వీరు సదా సిద్ధంగా ఉంటారు. ఇద్దరు కలిసి ఈ వేదికపై 145 వికెట్లు పడగొట్టారంటేనే గాలె వీరికి ఎలా అనుకూలిస్తుందో అర్థం చేసుకోవచ్చు. లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ప్రభాత్‌ ఈ వేదికపై ఆడిన 11 టెస్టుల్లో 81, ఆఫ్‌ స్పిన్నర్‌ రమేశ్‌ 12 మ్యాచ్‌ల్లో 64 వికెట్లు తీశారు. ముఖ్యంగా ప్రభాత్‌ జయసూర్య ఈ సిరీ్‌సలో అత్యంత కీలకం కానున్నాడని, అతడిని ముద్దుగా ‘కింగ్‌ ఆఫ్‌ గాలె’గా పిలుస్తారని లంక మాజీ ఆటగాడు మహరూఫ్‌ తెలిపాడు. గాలెలో అధికంగా గాలులు వీస్తుంటాయని, ఈ పరిస్థితులను ఎలా వినియోగించుకోవాలో అతడికి బాగా తెలుసని చెప్పాడు. ఈనేపథ్యంలో భారత్‌ బ్యాటర్లు ఈ ద్వయాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంపైనే విజయావకాశాలు ఉంటాయనడంలో సందేహం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి

డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..

అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..

Updated Date - Aug 14 , 2026 | 05:29 AM