అనుమతి లేకుండా ర్యాలీ.. 31మంది వైసీపీ నేతలపై కేసులు..
ABN , Publish Date - Aug 13 , 2026 | 07:45 PM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు పోలీసులు షాక్ ఇచ్చారు. అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం నిర్వహించిన ఆ పార్టీ నేతలపై మైలవరం నియోజకవర్గంలోని జి.కొండూరు పోలీసులు కేసులు నమోదు చేశారు.
మైలవరం: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు పోలీసులు షాక్ ఇచ్చారు. అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం నిర్వహించిన ఆ పార్టీ నేతలపై మైలవరం నియోజకవర్గంలోని జి.కొండూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈ నెల 10న ఫ్యాన్ పార్టీ నేతలు ర్యాలీ నిర్వహించారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
అయితే, ముందస్తు పోలీసుల అనుమతి తీసుకోకుండా ర్యాలీ నిర్వహించారని జి.కొండూరు పోలీసులు ఆరోపించారు. ఈ మేరకు మైలవరం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 31 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించాలన్నా అనుమతి తప్పనిసరని పోలీసులు స్పష్టం చేశారు. ప్రజా శాంతికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, వైసీపీ నేతలపై కేసులు నమోదు కావడం మైలవరం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, కేసులు నమోదైన 31 మందిపై పోలీసులు తదుపరి చర్యలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
డీఎస్సీపై తప్పుడు ప్రచారం చేస్తే వదిలిపెట్టొద్దు.. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వండి: మంత్రులతో చంద్రబాబు..
బాలికలపై లైంగిక వేధింపులు.. చర్చి పాస్టర్‌కు 20 ఏళ్ల జైలు