భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రిపై కొత్త భద్రతా నిబంధనలు
ABN , Publish Date - Aug 13 , 2026 | 04:22 PM
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో భక్తులకు కొత్త భద్రతా నిబంధనలను ఆలయ అధికారులు అమలులోకి తీసుకొచ్చారు. ఆలయ ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లపై పూర్తిస్థాయిలో నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
విజయవాడ, ఆగస్టు 13: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో భక్తులకు కొత్త భద్రతా నిబంధనలను ఆలయ అధికారులు అమలులోకి తీసుకొచ్చారు. ఆలయ ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లపై పూర్తిస్థాయిలో నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్కానింగ్ పాయింట్ వద్ద కొత్త భద్రతా గేట్ ఏర్పాటు చేశారు. స్కానింగ్ తర్వాత మొబైల్ ఫోన్ లోపలికి వెళ్లకుండా కఠినంగా తనిఖీలు చేయనున్నారు. ఈ నిబంధనల ప్రకారం, క్యూ లైన్లలోకి వెళ్లే ముందే ఫోన్లను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్ల కోసం ప్రత్యేక డిపాజిట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. భద్రతా తనిఖీలను కట్టుదిట్టం చేయాలని ఆలయ ఈవో శీనా నాయక్ ఆదేశాలు జారీ చేశారు.
హోంగార్డులు, అజైల్ సెక్యూరిటీ సిబ్బందితో పటిష్ఠమైన భద్రతను కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రద్దీ నియంత్రణకు దర్శన లైన్లలో మార్పులు చేపట్టారు. దర్శన టికెట్ల జారీ కౌంటర్ల స్థానాల్లో మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉచిత లడ్డూ ప్రసాదం కౌంటర్లను కూడా అధికారులు మార్చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా నేరుగా దర్శనానికి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. కొత్త నిబంధనలకు భక్తులు సహకరించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి..
సీఎం చేతుల మీదుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాలు జీఏడీకి అప్పగింత
మెరిట్, పారదర్శకత, న్యాయం.. నియామకాలలో ఇవే ప్రామాణికాలు: డోలా వీరాంజనేయస్వామి
Read Latest AP News And Telugu News