అభివృద్ధి కోసమే సీఎంకు మద్దతిచ్చా.. పోచారం మరోసారి హాట్ కామెంట్స్
ABN , Publish Date - Aug 13 , 2026 | 03:48 PM
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రికి మద్దతు ఇచ్చానని అన్నారు. అన్నం పెట్టిన వాళ్లను మరిచిపోతే పుట్టగతులుండవన్నారు.
కామారెడ్డి, ఆగస్టు 13: కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. అభివృద్ధి నిధులకు సంబంధించి తనకు న్యాయం జరగలేదంటూ కామెంట్స్ చేశారు. దానికి కొనసాగింపుగా ఈరోజు(గురువారం) కూడా వర్ని మండలం జాకోరా గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే... మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవల తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి రాజకీయం దురుద్దేశం లేదని స్పష్టం చేశారు. తనకు స్వార్థం ఉందంటూ బుద్ధిహీనులు ప్రచారం చేస్తున్నారని, స్వార్థం ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. ‘నా మాటల వెనుక రాజకీయం, రహస్యం లేదు. నేను డబ్బులకు అమ్ముడుపోయే వ్యక్తిని కాదు. నాకు ఎలాంటి స్వార్థం లేదు. ప్రజల కోసమే నా జీవితం’ అని స్పష్టం చేశారు.
అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రికి మద్దతు ఇచ్చానని ఎమ్మెల్యే అన్నారు. అన్నం పెట్టిన వాళ్లను మరిచిపోతే పుట్టగతులుండవన్నారు. కేసీఆర్ చేశారు కాబట్టే.. చేశారని చెప్పానని.. రేవంత్ రెడ్డి ఇచ్చినవి కూడా చెబుతానని తెలిపారు. ఉన్నది ఉన్నట్లు చెప్పడం తన నైజమని చెప్పుకొచ్చారు. పోరాటం చేస్తా తప్ప, తల వంచే రాజకీయం చేయనని స్పష్టం చేశారు. ప్రజల కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమైనా చేస్తానన్నారు. ఎమ్మెల్యేకు ప్రభుత్వ సహకారం కావాలని.. ప్రభుత్వ సహకారం లేకుంటే ఏమి చేయలేమని పోచారం శ్రీనివాస రెడ్డి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
సీఎం చేతుల మీదుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాలు జీఏడీకి అప్పగింత
ప్రైవేట్ బస్సును ఢీకొన్న కంటైనర్ లారీ.. ఇద్దరు మహిళల మృతి
Read Latest Telangana News And Telugu News