Share News

బాలికలపై లైంగిక వేధింపులు.. చర్చి పాస్టర్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష

ABN , Publish Date - Aug 13 , 2026 | 06:54 PM

చర్చికి వచ్చే బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఓ పాస్టర్‌కు విజయవాడ ప్రత్యేక పోక్సో కోర్టు శిక్ష ఖరారు చేసింది. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30,000 జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

బాలికలపై లైంగిక వేధింపులు.. చర్చి పాస్టర్‌కు 20 ఏళ్ల జైలుశిక్ష
Vijayawada Pastor Gets 20 Years Jail in POCSO Case

విజయవాడ, ఆగస్టు 13: సండే క్లాస్‌ల నిమిత్తం చర్చికి వచ్చే బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఓ పాస్టర్‌కు విజయవాడ ప్రత్యేక పోక్సో(POCSO) కోర్టు తీవ్రమైన శిక్ష ఖరారు చేసింది. దోషిగా తేలిన పాస్టర్‌కు 20ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30,000 జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి కె.జయలక్ష్మి సంచలన తీర్పు వెలువరించారు.


చర్చి పేరుతో దారుణం.. సండే స్కూల్ పిల్లలపై వేధింపులు

విజయవాడలోని మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న ఓ చర్చిలో ప్రతి ఆదివారం జరిగే 'సండే స్కూల్'కు వచ్చే ముగ్గురు బాలికలతో అక్కడి పాస్టర్ అసభ్యంగా ప్రవర్తించేవాడు. వారిపై లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా, ఈ విషయాలు బయటకు చెబితే తీవ్ర పర్యవసానాలు ఉంటాయని ఆ మైనర్లను భయభ్రాంతులకు గురిచేసేవాడని సమాచారం.


2020లో కేసు నమోదు.. నేరం రుజువు!

పాస్టర్ ఆగడాలు తట్టుకోలేక బాధిత బాలికలు ధైర్యంచేసి కుటుంబ సభ్యులకు తెలపడంతో.. 2020లో వారు మాచవరం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణలో భాగంగా ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి.. నిందితుడిపై నేరం ఆధారాలతో సహా రుజువైందని స్పష్టం చేశారు.


బాధితులకు ఆర్థిక పరిహారం

కోర్టు దోషికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు ఆర్థికంగా కూడా పరిహారం చెల్లించాలని ఆదేశించింది. దోషికి రూ.30,000 జరిమానా విధించారు. బాధితులైన ముగ్గురు చిన్నారులకు ఒక్కొక్కరికి రూ.1,00,000 చొప్పున పరిహారం అందజేయాలని న్యాయస్థానం తన తీర్పులో పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి

మెరిట్, పారదర్శకత, న్యాయం.. నియామకాలలో ఇవే ప్రామాణికాలు: డోలా వీరాంజనేయస్వామి

భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రిపై కొత్త భద్రతా నిబంధనలు

Updated Date - Aug 13 , 2026 | 07:54 PM