చాంపియన్లమనే ధోరణిలో ఉండాలి..
ABN , Publish Date - Aug 14 , 2026 | 05:25 AM
పాడీ ఆప్టన్..భారత క్రీడా జట్లతో అతడిది విడదీయరాని బంధం. 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు, పారిస్ ఒలింపిక్స్‌లో చారిత్రక కాంస్య పతకం దక్కించుకున్న భారత...
హాకీ వరల్డ్‌కప్
ఆమ్‌స్టర్‌డామ్: పాడీ ఆప్టన్..భారత క్రీడా జట్లతో అతడిది విడదీయరాని బంధం. 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు, పారిస్ ఒలింపిక్స్‌లో చారిత్రక కాంస్య పతకం దక్కించుకున్న భారత పురుషుల హాకీ జట్టుకు అతడు మెంటల్ కండీషనింగ్ కోచ్‌గా పని చేశాడు. ప్రస్తుతం పురుషుల హాకీ జట్టుకు అదే బాధ్యతల్లో కొనసాగుతున్నాడు. మరో రెండు రోజుల్లో ప్రతిష్ఠాత్మక ప్రపంచ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆప్టన్ మాట్లాడుతూ..మెగా టోర్నమెంట్‌కు ముందుగానే ‘చాంపియన్ల’ మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించాడు. ఏదైనా ప్రధాన టోర్నమెంట్‌కు క్రికెటర్లను, హాకీ ఆటగాళ్లకు సంసిద్ధం చేయడంలో తేడా జట్టు డైనమిక్స్‌పై ఆధారపడి ఉంటుందన్నాడు. ‘క్రికెట్‌లో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. కానీ హాకీలో జట్టు అంతా కలిసి రాణించడం ముఖ్యం. ఒక వ్యక్తి మనస్తత్వం ఇతరులపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఎంతో ముఖ్యం’ అని ఆప్టన్ విరించాడు.