Share News

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల భద్రతపై కో-ఆర్డినేషన్ సమావేశం

ABN , Publish Date - Aug 14 , 2026 | 04:41 PM

ఈనెల17వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై కో-ఆర్డినేషన్ సమావేశమైంది.

అసెంబ్లీ వర్షాకాల సమావేశాల భద్రతపై కో-ఆర్డినేషన్ సమావేశం
AP Assembly Monsoon Session 2026

అమరావతి, ఆగస్టు 14: ఈనెల17వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై కో-ఆర్డినేషన్ సమావేశమైంది. ఈరోజు(శుక్రవారం) అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్‌లో స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు అధ్యక్షతన సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన భద్రతా చర్యలపై ఐపీఎస్ అధికారులు, అసెంబ్లీ ఉన్నతాధికారులతో చర్చించారు.


వర్షాకాల సమావేశాల సందర్భంగా అసెంబ్లీ పరిసరాల్లో భద్రత, బందోబస్తు, సమన్వయంపై కీలకంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘు రామకృష్ణంరాజు, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ ఎన్.మధుసూదన్ రెడ్డి, గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్, ఐఎస్‌డబ్ల్యూ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం సమీక్ష

పాదగయ క్షేత్రానికి పవన్ సతీమణి.. ఆలయంలో ప్రత్యేక పూజలు

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 14 , 2026 | 04:41 PM