Share News

పాదగయ క్షేత్రానికి పవన్ సతీమణి.. ఆలయంలో ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Aug 14 , 2026 | 03:56 PM

పిఠాపురం నియోజకవర్గంలోని పలు ఆలయాలను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా సందర్శించారు. శ్రావణ మాసం తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

పాదగయ క్షేత్రానికి పవన్ సతీమణి.. ఆలయంలో ప్రత్యేక పూజలు
Anna Lezhneva

కాకినాడ జిల్లా, ఆగస్టు 14: పిఠాపురం నియోజకవర్గంలోని పలు ఆలయాలను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా లెజినోవా సందర్శించారు. శ్రావణ మాసం తొలి శుక్రవారాన్ని పురస్కరించుకుని పాదగయ క్షేత్రంలో కుక్కుటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ సతీమణికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఆపై శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానాన్నీ లెజినోవా సందర్శించారు.


అలాగే కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామం భీమేశ్వర స్వామి, అమ్మవార్లనూ అన్నా లెజినోవా దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న పవన్ సతీమణికి రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్, జనసేన ఇన్‌ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, ఇటీవల పవన్ కల్యాణ్‌‌కు ముంబైలోని ఆస్పత్రిలో భుజానికి సంబంధించిన శస్త్రచికిత్స విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీలోని పలు ఆలయాలను పవన్ సతీమణి సందర్శించి మొక్కులు చెల్లించుకుంటున్నట్లు తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం తిరుమల శ్రీవారిని కూడా అన్నా లెజినోవా దర్శించుకున్నారు. అలిపిరి మెట్ల మార్గం గుండా కాలినడక తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్న విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి...

అక్టోబర్ నాటికి 70 లక్షల టన్నుల చెత్త తొలగింపు పూర్తి: నారాయణ

పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం సమీక్ష

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 14 , 2026 | 04:15 PM