Share News

‘సీఎం డైరెక్షన్‌తోనే భూముల నిషేధం’.. ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు

ABN , Publish Date - Aug 14 , 2026 | 01:15 PM

తెలంగాణలోని పలువురు ఐఏఎస్ అధికారులపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లో భాగంగా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉద్దేశపూర్వకంగా భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారని ఆరోపించారు.

‘సీఎం డైరెక్షన్‌తోనే భూముల నిషేధం’.. ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు
MP Etela Rajender

హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణలోని పలువురు ఐఏఎస్ అధికారులపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్‌లో భాగంగా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉద్దేశపూర్వకంగా భూములను నిషేధిత జాబితాలో పెడుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నుంచి లేదా అయనకు సంబంధించిన వారి నుంచి క్లారిఫికేషన్ వచ్చిన తరువాత వాటిని క్లియర్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇది నేరుగా సీఎం కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపణలు గుప్పించారు.


భూముల విలువ ఎక్కువగా ఉన్నచోట ఈ తరహా దందా నడుస్తోందని ఎంపీ వ్యాఖ్యానించారు. ఇది కేవలం బాధితుల నుంచి డబ్బులు వసూలు చేయడంలో భాగమే అని అన్నారు. బాధితులు కాళ్లు అరిగేలా కలెక్టర్ కార్యాలయాలు, సబ్ రిజిస్టార్ ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతున్నారని ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

విషాదం: విద్యుత్ షాక్‌తో తండ్రీకొడుకు మృతి

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ భేటీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 14 , 2026 | 03:11 PM