బాధితులు చేతబడి చేస్తారని భయపడ్డ దొంగలు.. చివరకు ఏం చేశారంటే..
ABN , Publish Date - Aug 14 , 2026 | 01:02 PM
పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో వింత ఘటన జరిగింది. చేతబడి చేస్తారన్న భయంతో చోరీ చేసిన సొమ్మును దొంగలు.. తిరిగి యజమానికే అప్పగించడం సంచలనం రేపుతోంది.
పల్నాడు జిల్లా, ఆగస్టు 14: జిల్లాలోని నరసరావుపేటలో వింత ఘటన జరిగింది. చేతబడి చేస్తారన్న భయంతో చోరీ చేసిన సొమ్మును దొంగలు.. తిరిగి యజమానికే అప్పగించడం సంచలనం రేపుతోంది. జులై 30వ తేదీన నరసరావుపేటలోని ఓ అపార్ట్‌మెంట్‌లో దొంగతనం జరిగింది. దాదాపు 317 గ్రాముల బంగారం, రూ.21.5 లక్షల నగదును దుండగులు అపహరించారు. ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించిన బాధితులు.. చోరీకి గురైన సొత్తును తిరిగి పొందేందుకు, ఎవరు చోరీకి పాల్పడ్డారో తెలుసుకునేందుకు ఓ మంత్రగాడిని కలిసి అంజనం వేయించారు.
అపార్ట్‌మెంట్‌లో ఉండే వారే చోరీకి పాల్పడి ఉండవచ్చంటూ బాధితులకు మంత్రగాడు తెలిపాడు. ఇదే విషయాన్ని సదరు యజమాని అపార్ట్‌మెంట్ వాసులకు తెలియజేశాడు. ఇక్కడే ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో దొంగతనం చేసిన సదరు దుండగులు తిరిగి ఆ సొమ్మును యజమానికే అప్పజెప్పారు. అంతేకాకుండా, డబ్బులు పెట్టిన దగ్గర ఓ లేఖను కూడా వదిలి వెళ్లారు. తమను క్షమించాలని లేఖలో కోరుతూ... తమ వాటాగా వచ్చిన రూ.19 లక్షల నగదును చెప్పుల స్టాండ్‌లో వదలి వెళ్లారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని లేఖను స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. అయితే ఈ వింత దొంగతనంపై స్థానికులు స్పందిస్తూ.. ‘దొంగతనం జరిగితే పోలీసులను నమ్ముకోవడం కంటే మంత్రగాళ్లను నమ్ముకోవడం నయం’ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
కాకాణి కనుసన్నల్లో భూ అక్రమాలు.. కూటమి ప్రభుత్వం సీరియస్
జగన్ అసెంబ్లీకి రాని మొద్దు విద్యార్థి: ఎంపీ కేశినేని శివనాథ్
Read Latest AP News And Telugu News