Share News

పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం సమీక్ష

ABN , Publish Date - Aug 14 , 2026 | 03:05 PM

పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులకు సంబంధించి పనుల పురోగతి సహా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయనున్న 36 ప్రాజెక్టులు, రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నీటి విడుదల తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.

పోలవరం, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం సమీక్ష
CM Chandrababu

అమరావతి, ఆగస్టు 14: పోలవరం, వెలిగొండ ప్రాజెక్టులకు సంబంధించి పనుల పురోగతి సహా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రాధాన్య క్రమంలో పూర్తి చేయనున్న 36 ప్రాజెక్టులు, రాష్ట్రంలోని రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నీటి విడుదల తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. లోటు వర్షపాతం, భూగర్భ జలాలు, తాగు నీటి సరఫరా, నిర్వహణా ప్రణాళిక, జలధార- జలహారతి కార్యక్రమాల అమలుపై సీఎం దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టులో నిన్నటి వరకూ 89.9 శాతం మేర సివిల్ పనులు పూర్తైనట్టు అధికారులు తెలిపారు.


పోలవరం ఎడమ కాలువ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి అవుతున్నట్టు సీఎంకు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్-1, గ్యాప్-2లో పనులు శరవేగంగా చేపట్టినట్టు తెలిపారు. డ్యామ్ సైట్ వద్ద రోడ్ల లాంటి మౌలిక వసతుల పనులు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ప్రాజెక్టు సమీపంలోని గండి పోచమ్మ ఆలయాన్ని పరిరక్షిస్తూ స్థానికుల సెంటిమెంట్‌ను కాపాడేలా కార్యాచరణ చేపట్టాలన్నారు. ఇటీవల కాలంలో 14 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాలు వచ్చినా పనులకు ఇబ్బంది లేకుండా కొనసాగించినట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు. ఈ సమీక్షకు మంత్రి నిమ్మల రామానాయుడు, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

బాధితులు చేతబడి చేస్తారని భయపడ్డ దొంగలు.. చివరకు ఏం చేశారంటే..

అక్టోబర్ నాటికి 70 లక్షల టన్నుల చెత్త తొలగింపు పూర్తి: నారాయణ

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 14 , 2026 | 03:19 PM