Share News

అఫ్గాన్‌ బౌలర్లపై భారత్ ఆధిపత్యం.. రాహుల్ క్లాస్ సెంచరీ

ABN , Publish Date - Jun 06 , 2026 | 03:59 PM

అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ అద్భుత శతకంతో జట్టుకు బలమైన పునాది వేశాడు. ఈ క్రమంలో ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడీ స్టార్ బ్యాటర్.

అఫ్గాన్‌ బౌలర్లపై భారత్ ఆధిపత్యం.. రాహుల్ క్లాస్ సెంచరీ
KL Rahul

ఇంటర్నెట్ డెస్క్: ముల్లాన్‌పుర్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఓపెనర్ కేఎల్‌ రాహుల్‌ అద్భుత శతకంతో జట్టుకు బలమైన పునాది వేశాడు. రాహుల్ 165 బంతుల్లో 100 పరుగులు చేసి ఔట్‌ అయ్యాడు. తన టెస్ట్ కెరీర్‌లో ఇది 12వ శతకం కాగా.. టెస్టుల్లో అతడు శతకం సాధించిన ఆరో ప్రత్యర్థి జట్టు అఫ్గాన్.


ఆరంభంలో కొంత నెమ్మదిగా ఆడిన రాహుల్‌.. క్రమంగా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతూనే అఫ్గాన్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. 61వ ఓవర్లో జియావుర్‌ రెహ్మాన్‌ బౌలింగ్‌‌లో 2 పరుగులతో సెంచరీ సాధించాడు. ఆ తర్వాతి బంతికే వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో ఓపెనర్‌గా మరో మైలురాయిని అందుకున్నాడు రాహుల్. భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక శతకాలు సాధించిన ఓపెనర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో దిగ్గజ బ్యాటర్‌ సునీల్ గావస్కర్ 33 శతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఓపెనర్లు:

  • సునీల్ గావస్కర్ - 33

  • వీరేంద్ర సెహ్వాగ్ - 22

  • మురళీ విజయ్ - 12

  • కేఎల్ రాహుల్ - 11*


ఇవీ చదవండి:

టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు పగ్గాలు..

ధోని సరసన పంత్.. టెస్టుల్లో అరుదైన ఘనత

Updated Date - Jun 06 , 2026 | 03:59 PM