కేన్ విలియమన్స్ వరల్డ్ రికార్డ్
ABN , Publish Date - May 28 , 2026 | 03:12 PM
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్‌లు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 12 విభిన్న దేశాలలో టెస్ట్ క్రికెట్ ఆడిన తొలి జంటగా వారిద్దరూ రికార్డులెక్కారు.
స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్లు కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్‌లు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 12 విభిన్న దేశాలలో టెస్ట్ క్రికెట్ ఆడిన తొలి జంటగా వారిద్దరూ రికార్డులెక్కారు. ఐర్లాండ్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బెల్‌ఫాస్ట్ వేదికగా ఐర్లాండ్‌తో జరుగుతున్న టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 5 వికెట్ల నష్టానికి 361 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులో టామ్ బ్లండెల్(142), డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్(38) ఉన్నారు. అంతకంటే ముందు రచిన్ రవీంద్ర(121) సెంచరీతో సత్తాచాటాడు.
ఈ మ్యాచ్‌తో కేన్ విలియమ్సన్, టామ్ లాథమ్‌లు 12 విభిన్న దేశాలలో టెస్ట్ క్రికెట్ ఆడిన తొలి జంటగా రికార్డు సృష్టించారు. వీరికంటే ముందు ఈ ఇద్దరు ఆటగాళ్లు 11 దేశాలలో టెస్ట్ మ్యాచ్‌లు ఆడి షేన్ వార్న్, క్రిస్ గేల్, శివనారాయణ్ చందర్‌పాల్‌లతో పాటు పలువురు పాకిస్థాన్ దిగ్గజ ఆటగాళ్లతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉండేవారు. కానీ ఈ మ్యాచ్‌లో వారిందరిని కేన్, లాథమ్ అధిగమించారు. ఈ మ్యాచ్‌లో విలియమ్సన్ 36 పరుగులు చేసి పర్వాలేదనిపించగా... టామ్ లాథమ్ మాత్రం ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.
విలియమ్సన్ 2010లో భారత్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. తన తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అతడి కెప్టెన్సీలో కివీస్ తొలి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్(2021) టైటిల్‌ను సొంతం చేసుకుంది. విలియమ్సన్ ఇప్పటివరకు 109 టెస్టుల్లో 9,497 పరుగులు చేశాడు. లాథమ్ విషయానికి వస్తే..ఇప్పటివరకు 92 టెస్టులు ఆడి.. 16 సెంచరీలు, 31 అర్ధసెంచరీలతో 6,261 పరుగులు సాధించాడు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ దూకుడును ఎలా ఆపాలి? జోఫ్రా ఆర్చర్ సమాధానం ఇదే..
వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్