విమర్శలను పట్టించుకోకు.. వైభవ్‌కు రస్సెల్ స్పెషల్ మెసేజ్!
ABN , Publish Date - May 28 , 2026 | 12:26 PM
ఐపీఎల్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ వైభవ్‌ను ప్రశంసించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేసి మరోసారి సంచలనం సృష్టించిన ఈ 15 ఏళ్ల ఆటగాడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే క్రిస్ గేల్ అత్యధిక సిక్సర్ల రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ వైభవ్‌ను సోషల్ మీడియా వేదికగా ప్రశంసించాడు. అతడికి పలు కీలక సూచనలు చేశాడు.
‘నువ్వంటే నచ్చనివాళ్లు ఎన్నో విమర్శలు చేస్తారు. నీకు 15 ఏళ్లు కాదని అంటారు. వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 30 ఏళ్ల ఆటగాళ్లు కూడా నువ్వు సాధిస్తున్నది చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాగే కొనసాగు. నీ ఆటతీరును చూసి నేను నీకు అభిమానిగా మారిపోయాను. బౌలర్లను కాదు బంతిని చూడు.. బాదేయ్!’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా వైభవ్ చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే 65 సిక్సర్లు కొట్టాడు. దీంతో 2012లో క్రిస్ గేల్ నెలకొల్పిన 59 సిక్సర్ల రికార్డును అతడు బ్రేక్ చేశాడు. ఆసక్తికరంగా రస్సెల్ కూడా ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. 2019 సీజన్‌లో కేకేఆర్ తరఫున అతడు 52 సిక్సర్లు బాదాడు.
ఇవి కూడా చదవండి:
వైభవ్ దూకుడును ఎలా ఆపాలి? జోఫ్రా ఆర్చర్ సమాధానం ఇదే..
వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్