Share News

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు పాక్ సీనియ‌ర్ ప్లేయర్ గుడ్‌బై..

ABN , Publish Date - Oct 04 , 2026 | 08:16 PM

పాకిస్థాన్ మహిళల జట్టులో సీనియర్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ కైనాత్ ఇంతియాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది.

అంత‌ర్జాతీయ క్రికెట్‌కు పాక్ సీనియ‌ర్ ప్లేయర్ గుడ్‌బై..
Kainat Imtiaz Retirement

పాకిస్థాన్ మహిళల జట్టులో సీనియర్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ కైనాత్ ఇంతియాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధికారికంగా ప్ర‌క‌టించింది. 34 ఏళ్ల కైనాత్ ఇంతియాజ్ 2010 నుంచి 2023 మ‌ధ్య కాలంలో పాకిస్థాన్ త‌ర‌ఫున ప్రాతినిధ్యం వహించింది. తన కెరీర్‌లో 19 వ‌న్డేలు, 21 టీ20 మ్యాచ్‌లు ఆడింది.


ఆసియా క్రీడలు 2010, 20214లో స్వ‌ర్ణం గెలిచిన పాకిస్థాన్ జ‌ట్టులో కైనాత్ స‌భ్యురాలిగా ఉంది. 2017 ఐసీసీ మ‌హిళ‌ల ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ పాక్ త‌ర‌ఫున కైనాత్ నాలుగు మ్యాచ్‌లు ఆడింది. 2022 కామన్వెల్త్ గేమ్స్ జట్టులో కూడా సభ్యురాలిగా ఉంది. ఓవ‌రాల్‌గా రెండు ఫార్మాట్లు క‌లిపి 40 మ్యాచ్‌లాడిన కైనాత్ 18 వికెట్లు ప‌డ‌గొట్టింది. కైనాత్ పెద్ద‌గా రాణించ‌క‌పోవ‌డంతో జ‌ట్టులో చోటు కోల్పోయింద‌ని పీసీబీ తెలిపింది. ఇక రిటైర్మెంట్ అనంత‌రం కైనాత్ ఇంతియాజ్ అంత‌ర్జాతీయ క్రికెట్‌లో రిఫ‌రీగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించ‌నున్న‌ట్లు సమాచారం.


ఆగ‌స్టు,సెప్టెంబ‌ర్ మ‌ధ్య జ‌రిగిన జాతీయ మహిళల అండ‌ర్‌-19 టీ20 టోర్న‌మెంట్‌లో కైనాత్ మ్యాచ్ రిఫ‌రీగా ప‌నిచేసింది. కైనాత్ ఇంతియాజ్ త‌ల్లి స‌లీమా ఇంతియాజ్ కూడా ప్ర‌స్తుతం ఐసీసీ అంత‌ర్జాతీయ డెవ‌ల‌ప్‌మెంట్ ప్యానెల్‌లో అంపైర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తోంది. దీంతో ఐసీసీ ప్యానెల్‌లో పాకిస్థాన్ తరపున అంపైర్‌గా విధులు నిర్వహించిన తొలి మహిళా అంపైర్‌గా సలీమా చరిత్ర సృష్టించారు. పాక్ స‌లీమా 9 వ‌న్డేలు, 69 టీ20 మ్యాచ్‌ల్లో స‌లీమా అంపైర్ బాధ్య‌త‌లు నిర్వ‌హించింది.


ఇవి కూడా చదవండి:

మీకెందుకు ఇబ్బంది.. స్టాలిన్ 'షూటింగ్' వ్యాఖ్యలకు సీఎం విజయ్ ఘాటు కౌంటర్..

ప్రకృతి సాగులో ఏపీ నంబర్‌ వన్.. సీఎం చంద్రబాబుకు శివరాజ్‌సింగ్ చౌహాన్ ప్రశంసలు

రైలులోనే మీ వస్తువులు మర్చిపోయారా.. తిరిగి పొందే మార్గం ఇదే..!

Updated Date - Oct 04 , 2026 | 08:17 PM