Share News

విదేశీ వికెట్లలో బుమ్రా రికార్డు.. శ్రీనాథ్‌ను దాటేశాడు!

ABN , Publish Date - Nov 29 , 2026 | 02:54 PM

క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న‌ రెండో టెస్టులో టీమిండియా స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా మరో ప్రధాన మైలురాయిని సాధించాడు. విదేశీ మ్యాచ్‌ల్లో అత్య‌ధిక అంత‌ర్జాతీయ వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్ల ఆల్‌టైమ్ జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు.

విదేశీ వికెట్లలో బుమ్రా రికార్డు.. శ్రీనాథ్‌ను దాటేశాడు!
Jasprit Bumrah Record

స్పోర్ట్స్ డెస్క్: క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న‌ రెండో టెస్టులో టీమిండియా స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా మరో ప్రధాన మైలురాయిని సాధించాడు. విదేశీ మ్యాచ్‌ల్లో అత్య‌ధిక అంత‌ర్జాతీయ వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్ల ఆల్‌టైమ్ జాబితాలో నాలుగో స్థానానికి చేరుకున్నాడు. మూడో రోజు ఆట‌లో భాగంగా కివీస్ రెండో ఇన్నింగ్స్‌లో హెన్రీ నికోల్స్‌ను ఔట్ చేయ‌డం ద్వారా 32 ఏళ్ల బుమ్రా ఈ అరుదైన ఫీట్ సాధించాడు.


ఈ క్ర‌మంలో బుమ్రా టీమిండియా దిగ్గజ బౌలర్ జ‌వ‌గ‌ళ్ శ్రీనాథ్‌ను అధిగ‌మించాడు. జవగళ్ ఖాతాలో 340 అంతర్జాతీయ విదేశీ వికెట్లు ఉన్నాయి. తాజాగా హెన్రీ నికోల్స్ వికెట్ తీయ‌డం ద్వారా బుమ్రా.. ఆ మాజీ దిగ్గజాన్ని అధిగమించాడు. ఇక విదేశాల్లో భార‌త్ త‌ర‌ఫున అత్య‌ధిక అంత‌ర్జాతీయ వికెట్లు తీసిన బౌల‌ర్‌గా దిగ్గ‌జ స్పిన్న‌ర్ అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉన్నాడు. కుంబ్లే 248 మ్యాచ్‌ల్లో 477 వికెట్ల‌తో అగ్ర‌స్థానంలో ఉండ‌గా, జ‌హీర్ ఖాన్ 199 మ్యాచ్‌ల్లో 398 వికెట్ల‌తో రెండో స్థానంలో, క‌పిల్ దేవ్ 206 మ్యాచ్‌ల్లో 368 వికెట్ల‌తో మూడో స్థానంలో ఉన్నారు.


ఆ ముగ్గురి తర్వాత బుమ్రా 142 మ్యాచ్‌ల్లో 342 వికెట్ల‌తో నాలుగో స్థానంలో, ఐదో స్థానంలో జ‌వ‌గ‌ళ్ శ్రీనాథ్ 184 మ్యాచ్‌ల్లో 340 వికెట్ల‌తో ఉన్నారు. వీరి త‌ర్వాత హ‌ర్భ‌జ‌న్ (331 వికెట్లు), ఇషాంత్ శ‌ర్మ (296 వికెట్లు), ష‌మీ (294 వికెట్లు), అశ్విన్ (290 వికెట్లు), జ‌డేజా (254 వికెట్లు) తర్వాతి స్థానాల్లో కొన‌సాగుతున్నారు. ఇక బుమ్రా 53 టెస్టు మ్యాచ్‌ల్లో 2.76 ఎకాన‌మీ రేటుతో 239 వికెట్లు ప‌డ‌గొట్టాడు. మరోవైపు రెండో టెస్టులో న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా వికెట్లేమీ తీయకపోయినా, రెండో ఇన్నింగ్స్‌లో తనదైన ముద్ర వేశాడు. 12 ఓవర్లు వేసిన బుమ్రా 34 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించాడు.


ఇవి కూడా చదవండి:

మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూత

ఈ కుక్కకు గోల్డ్ మెడల్.. ఎందుకో తెలిస్తే..

Updated Date - Nov 29 , 2026 | 02:58 PM