Share News

ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన ఆర్సీబీ.. సన్‌రైజర్స్ బ్యాటింగ్

ABN , Publish Date - Mar 28 , 2026 | 07:20 PM

ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్ గెలిచి.. ఎస్ఆర్‌హెచ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియం వేదిక కానుంది.

ఐపీఎల్ 2026: టాస్ గెలిచిన ఆర్సీబీ.. సన్‌రైజర్స్ బ్యాటింగ్
RCB Vs SRH

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 (IPL 2026) తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో.. ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నారు. ఎస్ఆర్‌హెచ్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ హై ఓల్టేజ్ ఓపెనింగ్‌ మ్యాచ్‌కు బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియం వేదిక కానుంది.


తుది జట్లివే..

ఆర్సీబీ: రజత్ పాటిదార్(కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ(వికెట్‌ కీపర్‌), టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మ

ఎస్ఆర్‌హెచ్: ఇషాన్ కిషన్(కెప్టెన్‌, వికెట్‌కీపర్‌), అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబె, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ


ఇవీ చదవండి:

పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!

గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

Updated Date - Mar 28 , 2026 | 07:32 PM