Share News

టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. తొలి జట్టుగా రికార్డు!

ABN , Publish Date - Nov 01 , 2026 | 05:39 PM

హామిల్టన్‌ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినప్పటికీ ఓ అరుదైన రికార్డును సృష్టించింది.

టీ20 క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన భారత్.. తొలి జట్టుగా రికార్డు!
India T20I sixes record

స్పోర్ట్స్ డెస్క్: హామిల్టన్‌ వేదికగా జరిగిన ఆఖరి టీ20లో భారత్‌కు బిగ్ షాక్ తగిలింది. 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఓడినప్పటికీ ఓ అరుదైన రికార్డును సృష్టించింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ సంవత్సరంలో (2026) 400 టీ20 అంతర్జాతీయ సిక్సర్లు కొట్టిన ప్రపంచంలోనే తొలి జట్టుగా భారత్ నిలిచింది. ఈ చరిత్రాత్మక మైలురాయిని చేరుకోవడం ద్వారా భారత్ బ్యాటింగ్ సత్తా ఏంటో మరోసారి నిరూపితమైంది.


ఈ ఏడాది భారత్ 40 టీ20 మ్యాచ్‌లు ఆడగా.. 400 సిక్సర్లు బాదింది. ఇందులో 142 సిక్సర్లు కేవలం న్యూజిలాండ్‌పైనే సాధించింది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో ఒకే ప్రత్యర్థిపై ఒక జట్టు కొట్టిన అత్యధిక సిక్సర్ల విషయంలో ఇది ఒక కొత్త రికార్డు కావడం విశేషం. ఈ జాబితాలో117సిక్సర్లు భారత్‌‌పై సాధించిన కివీస్ రెండో స్థానంలో ఉంది. మరోవైపు మొత్తంగా టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్ల కొట్టిన జట్టుగా వెస్టిండీస్ అగ్రస్థానంలో ఉంది. ఆ జట్టు సాధించిన 2,026 సిక్సర్ల ఆల్ టైమ్ రికార్డును సమం చేసేందుకు టీమిండియా చాలా చేరువైంది.


మ్యాచ్ విషయానికి వస్తే టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నెమ్మదిగా ప్రారంభించినప్పటికీ.. మిడిలార్డర్ బ్యాటర్లు బౌలర్లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఫలితంగా భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోరును సాధించింది. 192 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 18 ఓవర్లనే ఛేదించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఆడమ్ మిల్నే, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‪గా ఫిలిప్స్ నిలిచారు. మొత్తంగా చివరి మ్యాచ్ ఓడినప్పటికీ 3-2 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది.


ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఒక ప్రత్యర్థిపై అత్యధిక సిక్సర్లు కొట్టిన జట్టు

  • 142 భారత్ vs న్యూజిలాండ్ (2026)

  • 117 న్యూజిలాండ్ vs భారత్ (2026)

  • 111 కంబోడియా vs ఇండోనేషియా (2025)


ఇవి కూడా చదవండి:

రాప్తాడు బాలికను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్

ఇరాన్‌‌లో మా టార్గెట్ ఇంకా పూర్తి కాలేదు: ట్రంప్

జపాన్‌ను కుదిపేసిన భారీ భూప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత

Updated Date - Nov 01 , 2026 | 05:45 PM