సీఎస్కే బ్యాటింగ్ కోచ్‌గా ఎంఎస్ ధోనీ.. బద్రీనాథ్ అంచనా ఏంటంటే..
ABN , Publish Date - Nov 01 , 2026 | 05:07 PM
భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత క్రికెట్ దిగ్గజం, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ఐపీఎల్ 2027లో ధోనీ ఆటగాడిగా కొనసాగుతాడా? లేక కోచింగ్ బాధ్యతలు నిర్వహిస్తాడా? అనే ప్రశ్నలు అభిమానుల్లో ఆసక్తి రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు సుబ్రమణ్యం బద్రీనాథ్ ఆసక్తికరమైన అంచనా వేశాడు (MS Dhoni CSK Batting Coach).
సీఎస్కే జట్టుకు ధోనీ బ్యాటింగ్ కోచ్‌తో పాటు మెంటార్‌గా వ్యవహరించే అవకాశం ఉందని బద్రీనాథ్ అభిప్రాయపడ్డాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆరు సంవత్సరాల పాటు ప్రాతినిధ్యం వహించిన బద్రీనాథ్ తన యూట్యూబ్ ఛానెల్లో ధోనీ భవిష్యత్తు గురించి మాట్లాడాడు. సీఎస్కే కోచింగ్ బృందంలో ముగ్గురు అసిస్టెంట్ కోచ్‌లు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా బ్యాటింగ్ కోచ్‌ను నియమించలేదన్నాడు. ఈ నేపథ్యంలో ధోనీనే బ్యాటింగ్ కోచ్, మెంటార్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తనకు అనిపిస్తోందని చెప్పాడు (MS Dhoni Mentor).
ఐపీఎల్ 2027 కోసం చెన్నై సూపర్ కింగ్స్ తన కోచింగ్ విభాగంలో మార్పులు చేసింది (CSK Coaching Staff). జహీర్ ఖాన్‌ను హెడ్ కోచ్‌గా నియమించింది. మోహిత్ శర్మ, గారెత్ బ్యాటీ, ఆల్బీ మోర్కెల్లకు కోచింగ్ బృందంలో బాధ్యతలు అప్పగించింది. అయితే ఈ జాబితాలో ప్రత్యేక బ్యాటింగ్ కోచ్ పేరు లేదు. ఐపీఎల్ 2026లో ధోనీ అభిమానులకు నిరాశే ఎదురైంది. గాయం కారణంగా ధోనీ గత సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2027లో ధోనీ మైదానంలోకి దిగుతాడా? లేదా మెంటార్‌గా జట్టుకు సేవలు అందిస్తాడా? అనేది ఇంకా స్పష్టత రాలేదు.
ఈ వార్తలనూ చదవండి:
ఇరాన్లో మా టార్గెట్ ఇంకా పూర్తి కాలేదు: ట్రంప్
జపాన్ను కుదిపేసిన భారీ భూప్రకంపనలు.. రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రత