Share News

చరిత్ర సృష్టించిన భువనేశ్వర్.. సౌథీ రికార్డు బద్దలు

ABN , Publish Date - Oct 22 , 2026 | 01:54 PM

టీమిండియా పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చి.. చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టీ20లో భాగంగా పవర్‌ప్లేలో అత్యధిక డాట్‌ బాల్స్‌ వేసిన బౌలర్‌గా నిలిచాడు.

చరిత్ర సృష్టించిన భువనేశ్వర్.. సౌథీ రికార్డు బద్దలు
Bhuvneshwar Kumar

స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్, భారత్ మధ్య ఇవాళ్టి నుంచి టీ20 సిరీస్ ప్రారంభమైంది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగుతోంది. నాలుగేళ్ల విరామం తర్వాత టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేశాడు. ఈ క్రమంలోనే భువీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. పవర్‌ప్లేలో అత్యధిక డాట్‌ బాల్స్‌ వేసిన బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్‌ మాజీ పేసర్‌ టిమ్‌ సౌథీ రికార్డును భువీ బ్రేక్ చేశాడు.


క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో కివీస్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. తొలి ఓవర్‌ వేసిన భువనేశ్వర్‌ కేవలం నాలుగు పరుగులే ఇచ్చి మూడు డాట్‌ బాల్స్‌ వేశాడు. దీంతో పూర్తి సభ్య దేశాల బౌలర్లలో అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల పవర్‌ప్లేలో అత్యధిక డాట్‌ బాల్స్‌ వేసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 10 ఓవర్లు ముగిసే సరికి న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయి..98 పరుగులు చేసింది. మయాంక్ యాదవ్, నితీశ్ రెడ్డి చెరో వికెట్ తీశారు.


ఇవి కూడా చదవండి:

అయ్యర్‌కు కివీస్‌ సవాల్‌

కివీస్‌ను భయపెడుతున్న వైభవ్.. శాంట్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు

డబ్ల్యూటీసీ చరిత్రలో దక్షిణాఫ్రికా సంచలనం.. ఆసీస్‌కు తొలిసారి ఫాలో ఆన్!


టీ20 పవర్‌ప్లేల్లో అత్యధిక డాట్‌ బాల్స్‌ వేసిన బౌలర్లు:

  • భువనేశ్వర్‌ కుమార్(భారత్)‌ – 680

  • టిమ్‌ సౌథీ(న్యూజిలాండ్) – 679

  • రిచర్డ్‌ నగరవా(జింబాబ్వే) – 674

  • షాహీన్‌ అఫ్రిది (పాకిస్థాన్)– 625

  • బ్లెస్సింగ్‌ ముజరబానీ(జింబాబ్వే) – 614

  • అర్ష్‌దీప్‌ సింగ్‌ (భారత్)– 576

  • జస్ప్రీత్‌ బుమ్రా(భారత్) – 569

Updated Date - Oct 22 , 2026 | 02:02 PM