ఐర్లాండ్‌పై ప్రతీకారానికి భారత్ సిద్ధం.. రెండో టీ20కి వర్షం ముప్పు ఉందా?
ABN , Publish Date - Jun 28 , 2026 | 01:01 PM
భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఇవాళ తుది పోరుకు రంగం సిద్ధమైంది. బెల్‌ఫాస్ట్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది.
స్పోర్ట్స్ డెస్క్: భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా ఆదివారం (జూన్ 28న) తుది పోరుకు రంగం సిద్ధమైంది. బెల్‌ఫాస్ట్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్ అనూహ్య విజయంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలవగా.. నేటి మ్యాచ్ భారత్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారింది.
శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్ వంటి సీనియర్, స్టార్ ఆటగాళ్లతో బరిలోకి దిగినప్పటికీ.. మొదటి మ్యాచ్‌లో టీమిండియా 34 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. సిరీస్ గెలిచే అవకాశం చేజారిన నేపథ్యంలో, కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని భారత్ పట్టుదలగా ఉంది. మరోవైపు, తొలి మ్యాచ్ గెలిచి చరిత్ర సృష్టించిన ఐర్లాండ్.. అదే ఉత్సాహంతో భారత్‌పై తొలిసారి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది.
టాస్‌పై వాతావరణ ప్రభావం!
స్థానిక వాతావరణ నివేదిక ప్రకారం.. మ్యాచ్ జరిగే సమయంలో బెల్‌ఫాస్ట్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. వర్షం కురిసే అవకాశం 25 శాతంగా ఉంది. తేమ శాతం 57 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది. వర్షం పడే అవకాశాలు తక్కువగానే ఉన్నందున, అభిమానులకు పూర్తి ఓవర్ల ఆట వీక్షించే అవకాశం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే, వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఇరు జట్ల కెప్టెన్లకు టాస్ కీలకం కానుంది. తొలి మ్యాచ్ ఘోర పరాజయానికి బ్యాటింగ్, బౌలింగ్ లోపాలను సరిదిద్దుకుని భారత్ పునరాగమనం చేస్తుందో లేదో చూడాలి.
భారత జట్టు:
శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సూర్యాంశ్ షెడ్గే, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, హర్షిత్ రాణా, ప్రసిధ్ కృష్ణ
ఐర్లాండ్ జట్టు:
లోర్కాన్ టక్కర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, టిమ్ టెక్టర్, బెన్ కాలిట్జ్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, స్టీఫెన్ డోహెనీ, మాథ్యూ హంఫ్రీస్, గావిన్ హోయ్, లియామ్ మెక్‌కార్తీ, రూబెన్ విల్సన్, జై మూండ్రా, మాథ్యూ హోలార్డ్
ఇవి కూడా చదవండి:
జోఫ్రా ఆర్చర్‌పై ఆగ్రహించిన ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ .. వీడియో వైరల్
వెనెజువెలా భూకంపాలు.. కుమార్తెను కాపాడుతూ ఫుట్‌బాల్ ఆటగాడి భార్య మృతి..