Share News

చరిత్ర సృష్టించిన హసన్.. తొలి బంగ్లా బౌలర్‌గా రికార్డ్..

ABN , Publish Date - Nov 06 , 2026 | 09:49 PM

వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ పేస‌ర్ హ‌స‌న్ మ‌హ‌మూద్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 27 ఏళ్ల హసన్‌ తన సంచలన బౌలింగ్‌తో విండీస్ టాపార్డర్‌ను దెబ్బతీశాడు.

చరిత్ర సృష్టించిన హసన్.. తొలి బంగ్లా బౌలర్‌గా రికార్డ్..
Hasan Mahmud

స్పోర్ట్స్ డెస్క్: వెస్టిండీస్‌తో జ‌రుగుతున్న రెండో టెస్టులో బంగ్లాదేశ్ పేస‌ర్ హ‌స‌న్ మ‌హ‌మూద్ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 27 ఏళ్ల హసన్‌ మ‌హ‌మూద్ తన సంచలన బౌలింగ్‌తో విండీస్ టాపార్డర్‌ను దెబ్బతీశాడు. తొలి ఇన్నింగ్స్‌లో హసన్‌ 6 వికెట్లు సాధించాడు. దీంతో టెస్టుల్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఫైవ్ వికెట్ హాల్స్ నమోదు చేసిన తొలి బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్‌గా హసన్ చరిత్ర సృష్టించాడు.


హసన్ టెస్టు కెరీర్‌లో ఇది ఐదో ఐదు వికెట్ల ప్రదర్శన కావడం విశేషం. గతంలో ఈ రికార్డు మాజీ పేసర్ షాహాదత్ హొస్సేన్ పేరిట ఉండేది. అతడు నాలుగు సార్లు టెస్టుల్లో ఐదు వికెట్ల ఘనత సాధించాడు. తాజా మ్యాచ్‌తో అతడి ఆల్‌టైమ్ రికార్డును హసన్ బద్దలు కొట్టాడు. కాగా హసన్ స్వదేశంలో ఐదు వికెట్లు తీయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అలానే ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియాన్ తర్వాత ఐదు వేర్వేరు దేశాల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా హసన్ నిలిచాడు. హసన్ గతంలో రావల్పిండి, చెన్నై, డార్విన్, అబుదాబి వేదికలపై తాజాగా సిల్హెట్‌లో ఐదు వికెట్లను సాధించాడు.


ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 356 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి బంగ్లా దేశ్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. క్రీజులో తౌహిద్ హ్రిదోయ్(29), ముష్ఫికర్ రహీమ్(19) ఉన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

నా భార్య క్యాన్సర్ పోరాటం.. నా జీవితాన్ని మార్చేసింది: కివీస్ ప్లేయర్

ప్రధానిని కలిసిన సూర్యకుమార్ యాదవ్.. చిన్నారులతో సరదాగా గడిపిన మోదీ..

బంగ్లాదేశ్ క్రికెటర్‌కు తీవ్ర గాయం.. స్ట్రెచర్‌పై తరలింపు!

Updated Date - Nov 06 , 2026 | 09:49 PM