Share News

హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర.. మహిళల టీ20ల్లో తొలి కెప్టెన్‌గా అరుదైన రికార్డు!

ABN , Publish Date - Sep 05 , 2026 | 09:17 PM

మహిళా భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఫీట్ సాధించింది. మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వారిలో హర్మన్ తొలి స్థానంలో నిలిచింది.

హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర.. మహిళల టీ20ల్లో తొలి కెప్టెన్‌గా అరుదైన రికార్డు!
Harmanpreet Kaur

స్పోర్ట్స్ డెస్క్: మహిళల టీ20 ఆసియా కప్ టోర్నీ2026లో భాగంగా ఇవాళ(శనివారం) దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. భారత్ బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లలు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇక థాయ్‌లాండ్‌, హాంకాంగ్‌లపై విజయాలతో భారత్ ఇప్పటికే సెమీస్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి అజేయంగా నిలవాలని హర్మన్ ప్రీత్ కౌర్ సేన భావిస్తోంది.


ఈ నేపథ్యంలో కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ అరుదైన ఫీట్ సాధించింది. మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన వారిలో హర్మన్ తొలి స్థానంలో నిలిచింది. హర్మన్‌కు కెప్టెన్‌గా ఇది 150వ మ్యాచ్ కావడం విశేషం. పురుషుల, మహిళల క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యహరించిన రికార్డు కూడా హర్మన్ పేరిటనే ఉండటం విశేషం


ఈ జాబితాలో శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు 121 మ్యాచ్‌లతో రెండో స్థానంలో ఉంది. అలానే ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ లానింగ్ 100 మ్యాచ్‌లు, హెథర్ నైట్(ఇంగ్లండ్) 96 మ్యాచ్‌లతో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. భారత్ బౌలర్ల దెబ్బకు 18.1 ఓవర్లకు 55 పరుగులకే పాక్ ఆలౌటైంది. టీమిండియా బౌలర్లలో శ్రీచరణి, ప్రేమ రావత్ చెరో మూడు వికెట్లు సాధించారు. దీప్తి శర్మ రెండు, షఫాలీ వర్మ ఒక వికెట్ తీశారు.


ఇవి కూడా చదవండి:

పాక్‌తో మ్యాచ్.. స్మృతి మంధానని ఊరిస్తున్న ఆల్‌టైమ్ రికార్డు

టీచర్స్ డే.. ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సచిన్!

Updated Date - Sep 05 , 2026 | 09:31 PM