నా దగ్గర మాటల్లేవు.. ఓటమిపై స్పందించిన హార్దిక్ పాండ్య
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:52 PM
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఓడిన సంగతి తెలిసిందే. ముంబై బ్యాటర్లు బాగానే రాణించిన.. బౌలర్లు మాత్రం పూర్తిగా విఫలమయ్యారు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్-2026లో భాగంగా నిన్న(గురువారం) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఓడిన సంగతి తెలిసిందే. ముంబై బ్యాటర్లు బాగానే రాణించినా బౌలర్లు మాత్రం పూర్తిగా విఫలమయ్యారు. పంజాబ్ విజయం నల్లేరు మీద నడకలా సాగింది. ఈ మ్యాచ్‌పై పంజాబ్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా స్పందించాడు. పరాజయాలపై సమీక్ష నిర్వహిస్తామని, భవిష్యత్తులో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదేమోనని వ్యాఖ్యానించాడు.
మ్యాచ్ అనంతరం హార్దిక్ పాండ్య మాట్లాడుతూ.. ‘ఈ ఓటమి గురించి మాట్లాడేందుకు నా దగ్గర మాటలు లేవు. బంతి రివర్స్ స్వింగ్ అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావం వల్ల పరిస్థితులు కొంచెం బ్యాటింగ్‌కు అనుకూలంగా మారాయి. కానీ పంజాబ్ కింగ్స్ అన్ని విభాగాల్లో మా కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. మమ్మల్ని చిత్తుగా ఓడించింది. మేం ఎక్కడ పొరపాటు చేస్తున్నామో తెలుసుకునేందుకు సమీక్ష నిర్వహిస్తాం' అని వెల్లడించాడు.
'ఆటగాళ్ల వైఫల్యమా? జట్టు వైఫల్యమా? మా ప్రణాళికల్లోనే లోపాలున్నాయా? అన్న అంశాలపై చర్చించాల్సి ఉంది. ఈ క్రమంలో రానున్న రోజుల్లో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు. లేదంటే ఇలాగే కొనసాగుతూ పరిస్థితులు చక్కదిద్దాలా అన్న విషయం గురించి ఆలోచిస్తాం.' అని పాండ్య వెల్లడించాడు. కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు అని హార్దిక్ చేసిన వ్యాఖ్యలను ముంబై ఇండియన్స్ సీనియర్లు పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మను ఉద్దేశించే చేసినట్లు క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ముంబై అభిమానులను రెచ్చగొట్టిన అయ్యర్!
ఐపీఎల్‌లో అరుదైన రికార్డు సృష్టించిన డికాక్