Share News

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: ఎంపీ శశిథరూర్

ABN , Publish Date - Apr 17 , 2026 | 12:12 PM

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు నష్టం జరగదని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారని, వారి మాటలకు విరుద్ధంగా డీలిమిటేషన్ బిల్లు రూపొందించారని ఆయన విమర్శించారు.

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం: ఎంపీ శశిథరూర్
Delimitation discussion

ఢిల్లీ, ఏప్రిల్ 17: పార్లమెంట్‌లో లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై చర్చ తీవ్రరూపం దాల్చింది. జనాభా ఆధారంగా సీట్ల సంఖ్యను పెంచాలనే ఉద్దేశ్యంతో, కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి చొరవ తీసుకుంటోంది. అయితే డీలిమిటేషన్ బిల్లును ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఇవాళ(శుక్రవారం) రెండో రోజు కూడా డీలిమిటేషన్ బిల్లుపై చర్చ జరుగుతోంది. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు.


లోక్‌సభలో ఆయన మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాలు నష్టం జరగదని ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారని, వారి మాటలకు విరుద్ధంగా డీలిమిటేషన్ బిల్లు రూపొందించారని ఆయన విమర్శించారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలు రాజకీయంగా మరింత నష్టపోతాయని శశిథరూర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం మంచిదేనని, అయితే దీని అమలకు 2011 జనాభా లెక్కలకు, నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు ముడిపెట్టడారని ఆయన విమర్శించారు. ఇవాళ లోక్‌సభలో జరుగుతోన్న డీలిమిటేషన్‌పై చర్చలో ప్రతిపక్షాల తరఫున శశిథరూర్ మాట్లాడుతున్నారు.


మరోవైపు లోక్ సభలో ఈ మూడు బిల్లుల ఓటింగ్ ఉత్కంఠ రేపుతోంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు స్పీకర్ ఓంబిర్లా ఓటింగ్ చేపట్టనున్నారు. విపక్షాల్లోని పలు పార్టీలతో ఎన్డీయే నేతలు మంతనాలు చేస్తున్నారు. మరోవైపు ఓటింగ్ వేళ ఇండియా కూటమి వ్యూహరచన చేపట్టింది. ఇండియా కూటమికి భేటీకి ఆర్జేడీ హాజరుకావడంతో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఒక్కొక సభ్యుడు ఉన్న పార్టీలను కూడా ఈ కూటమి సంప్రదిస్తోంది.


ఇవి కూడా చదవండి:

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నిక

గ్యాస్‌ కొరతతో నిలిచిన ఆటోలు

Updated Date - Apr 17 , 2026 | 01:00 PM