రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నిక
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:39 AM
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ సింగ్ మూడోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆయనకు అభినందనలు తెలియజేశారు.
ఇంటర్నెట్ డెస్క్: రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ నారాయణ్ సింగ్ ఎన్నికయ్యారు. ప్రతిపక్ష అభ్యర్థులు ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఆయన ఉపసభాపతి బాధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ డిప్యూటీ చైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అనుభవం రాజ్యసభకు ఎంతో అవసరమని అన్నారు. ఆయన అందరినీ కలుపుకుని వెళ్లాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. హరివంశ్ నేతృత్వంలో సభ మరింత శక్తిమంతం అవుతుందని అన్నారు. రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా నూతన ఉపసభాపతికి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రతిపక్షానికి కూడా తగిన ప్రాధాన్యం ఇస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు.