Share News

ఆ రెండు తప్పిదాలే మా ఓటమికి కారణం: హార్దిక్ పాండ్య

ABN , Publish Date - Apr 30 , 2026 | 08:12 AM

ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌ రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు కేవలం 18.4 ఓవర్లలోనే అందుకుంది.

ఆ రెండు తప్పిదాలే మా ఓటమికి కారణం: హార్దిక్ పాండ్య
Hardik Pandya statement

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌ రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న(బుధవారం)జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. 244 పరుగుల భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు కేవలం 18.4 ఓవర్లలోనే అందుకుంది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా హెన్రిచ్ క్లాసెన్ నిలిచాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్య.. బ్యాటింగ్‌లో రాణించినా.. బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం తమ విజయవకాశాలను దెబ్బతీశాయని తెలిపాడు.


'మ్యాచ్‌పై మంచు పెద్దగా ప్రభావం చూపలేదు. ప్రత్యర్థి బ్యాటర్లు కొన్ని అద్భుతమైన షాట్స్ ఆడారు. దీంతో వారికి మంచి ఆరంభం లభించింది. ఆ తర్వాత మేం తిరిగి పుంజుకున్నాం. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది. మా బ్యాటింగ్ చాలా మెరుగైంది. 244 పరుగులు మంచి స్కోర్‌ను మా బౌలర్లు డిఫెండ్ చేస్తారని నమ్మాను. కానీ ఈ రోజు మా బౌలింగ్ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాం' అని వెల్లడించాడు.


'ఈ సీజన్‌లో మేం చాలా క్యాచ్‌లు వదిలేస్తున్నాం. మా ఫీల్డింగ్‌ కారణంగా గెలుపు అవకాశాలు చేజారాయి. క్యాచ్‌లను పట్టుకున్నప్పుడే పరిస్థితి మారుతుంది. క్యాచ్‌లు వదిలేస్తే జట్టుకు నష్టం జరుగుతుంది. మొత్తంగా గెలుపు కోసం మా కుర్రాళ్లంతా బాగా ప్రయత్నించారు. కానీ ఈ రోజు మాకు కలిసి రాలేదు. మా తప్పులను సరి చేసుకొని, తదుపరి మ్యాచులకు సన్నద్ధమవుతాము. ప్రేక్షకుల నుంచి మాకు అద్భుతమైన మద్దతు లభిస్తోంది. కానీ మాకు మద్దతు ఇచ్చేంత గొప్ప ప్రదర్శనను మేం వారికి అందించలేకపోయాం. వారి నమ్మకాన్ని తిరిగి పొందడానికి మేం కృషి చేయాల్సిన అవసరం ఉంది'అని హార్దిక్ పాండ్య చెప్పుకొచ్చాడు.


ఇవి కూడా చదవండి:

ముంబై ఇండియన్స్‌ చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిన రికెల్టన్‌

అవును..భగవంతుడే ఆ బ్యాటిచ్చాడు

Updated Date - Apr 30 , 2026 | 08:40 AM