Share News

23 ఏళ్ల తర్వాత శ్రీనాథ్ రికార్డుకు చేరువలో గుర్నూర్ బ్రార్

ABN , Publish Date - Nov 08 , 2026 | 11:06 AM

న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో టీమిండియా యువ పేసర్ గుర్నూర్ బ్రార్ 30 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో కివీస్ గడ్డపై అత్యుత్తమ వన్డే బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన భారత పేసర్ల జాబితాలో జవగల్ శ్రీనాథ్ తర్వాతి స్థానాన్ని దక్కించుకున్నాడు.

23 ఏళ్ల తర్వాత శ్రీనాథ్ రికార్డుకు చేరువలో గుర్నూర్ బ్రార్
Gurnoor Brar

స్పోర్ట్స్ డెస్క్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా యువ పేసర్ గుర్నూర్ బ్రార్ అద్భుత ప్రదర్శన చేశాడు. నిప్పులు చెరిగే బంతులతో కివీస్ బ్యాటర్లను వణికించాడు. గుర్నూర్ దెబ్బకు న్యూజిలాండ్ 134 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన గుర్నూర్ 4/30 గణాంకాలు నమోదు చేశాడు. ఈ క్రమంలోనే బ్రార్ ఓ అరుదైన ఘనతను సాధించాడు. అది కూడా మాజీ క్రికెటర్ జవగల్ శ్రీనాథ్ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు సాధించిన 23 ఏళ్ల తర్వాత కివీస్ గడ్డపై గుర్నార్ అందుకున్నాడు.


న్యూజిలాండ్ గడ్డపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత రెండో ఫాస్ట్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 2003లో జవగల్ శ్రీనాథ్ (4/23) కివీస్ గడ్డపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్‌గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మూడో స్థానంలో కూడా శ్రీనాథ్(4/52) ఉన్నాడు. 1995లో నేపియర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు తీసిన శ్రీనాథ్ 52 పరుగులు ఇచ్చాడు. మొత్తంగా 23 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ గడ్డపై గుర్నూర్ రూపంలో మరో పేసర్ అత్యుత్తమ గణాకాలు నమోదు చేయడంపై క్రీడా విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు


కివీస్ గడ్డపై అత్యుత్తమ వన్డే బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన టీమిండియా పేసర్లు:

  • జవగల్ శ్రీనాథ్- 4/23, 2003

  • గుర్నూర్ బ్రార్-4/30, 2026

  • జవగల్ శ్రీనాథ్- 4/52,1995

  • మహ్మద్ షమీ-4/55, 2014

  • అర్షదీప్ సింగ్-4/70, 2026


ఇవి కూడా చదవండి:

చరిత్ర సృష్టించిన తానియా

బ్యాట్ విసిరిన అభిమాని.. కోహ్లీ ఏం చేశాడంటే..

ఆసీస్ పర్యటనకు ఇంగ్లండ్ స్టార్ బౌలర్ దూరం

Updated Date - Nov 08 , 2026 | 11:13 AM