Share News

ఐపీఎల్ 2026: ఛీర్‌లీడర్స్‌తో ఆకతాయిల అసభ్య ప్రవర్తన..

ABN , Publish Date - May 24 , 2026 | 12:43 PM

లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్‌ జట్ల మధ్య ఏకనా స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌ సమయంలో ఛీర్‌లీడర్స్‌ పట్ల ప్రేక్షకుల్లో కొందరు అనుచితంగా ప్రవర్తించడం కలకలం రేపింది.

ఐపీఎల్ 2026:  ఛీర్‌లీడర్స్‌తో ఆకతాయిల అసభ్య ప్రవర్తన..
IPL 2026 cheerleaders incident

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా శనివారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఎకానా స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో లఖ్‌నవూపై పంజాబ్ విజయం సాధించింది. ఈ విజయంతో ప్లే‌ఆఫ్స్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన సెంచరీతో పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించగా, ఎల్‌ఎస్‌జీ ఈ సీజన్‌లో తమ 10వ ఓటమిని చవిచూసింది. అయితే, మ్యాచ్ సందర్భంగా అభిమానులు, ఛీర్‌లీడర్ల మధ్య జరిగిన ఒక అవాంఛనీయ ఘటన కలకలం రేపింది.


మ్యాచ్ సమయంలో కొందరు అభిమానులు ఛీర్‌లీడర్స్‌తో దురుసుగా ప్రవర్తించారు. అయితే, వెంటనే పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వీడియోలో పోలీసు అధికారులు వెంటనే జోక్యం చేసుకుని అనుచితంగా ప్రవర్తించిన అభిమానులపై చర్య తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఒక మహిళా పోలీసు అధికారిణి కూడా ప్రేక్షకులతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. అలానే ఓ ఛీర్ లీడర్ కూడా ఏదో అసహనంగా మాట్లాడుతున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఛీర్ లీడర్స్ తమకు జరిగిన చేదు అనుభవం గురించి పోలీసులకు వివరించారు.


మొత్తంగా ఈ వీడియోపై నెటిజన్లు ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. అనుచితంగా ప్రవర్తించిన వారిపై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. అభిమానులను అలరించేందుకు కష్టపడేవారి పట్ల అలా ప్రవర్తించడం సిగ్గు చేటని, హుందాగా వ్యవహరించడం నేర్చుకోండంటూ పలువురు నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఐపీఎల్‌లోని ప్రతి మ్యాచ్‌ సమయంలోనూ కొందరు ఇలాగే వ్యవహరిస్తున్నారని, అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

అర్జున్ కోసం సారా టెండూల్కర్ ఎమోషనల్ పోస్ట్

ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా మహమ్మద్ షమీ..

Updated Date - May 24 , 2026 | 02:48 PM