Share News

టీమిండియా రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్..

ABN , Publish Date - Nov 22 , 2026 | 07:54 AM

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వేదికగా ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు అరుదైన ఘనత నమోదు చేసింది. ఈ చరిత్రాత్మక మైదానంలో అత్యధిక టీ20 అంతర్జాతీయ స్కోరు సాధించిన జట్టుగా ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది.

టీమిండియా రికార్డు బద్దలు కొట్టిన ఇంగ్లండ్..
England T20 Record

స్పోర్ట్స్ డెస్క్: మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వేదికగా ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు అరుదైన ఘనత నమోదు చేసింది. ఈ చరిత్రాత్మక మైదానంలో అత్యధిక టీ20 అంతర్జాతీయ స్కోరు సాధించిన జట్టుగా ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. తద్వారా ఈ గ్రౌండ్‌లో నాలుగేళ్లుగా టీమిండియా పేరిట ఉన్న అత్యధిక స్కోరు రికార్డును అధిగమించింది.


2022 టీ20 ప్రపంచకప్‌లో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. తాజా మ్యాచ్‌లో 187 పరుగులు చేసిన ఇంగ్లండ్ జట్టు.. భారత్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టింది. కాగా, కంగారు గడ్డపై ఇంగ్లండ్‌కు ఇది మూడో అత్యధిక టీ20 స్కోరు కావడం విశేషం. 2022లో పెర్త్‌లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ చేసిన 208/6 స్కోరే వారి అత్యధిక స్కోరు. రెండోస్థానంలో 2014లో హోబర్ట్‌లో ఆతిథ్య జట్టుపై చేసిన 200/9 స్కోరు ఉంది. తాజాగా రికార్డు స్థాయి స్కోరు సాధించినప్పటికీ ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ పరాజయం పాలైంది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.


ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 187 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో ఛేదించింది. ఆసీస్ విజయంలో నిఖిల్ చౌదరి (66), సామ్ హార్పర్ (32), జాక్ ఎడ్వర్డ్స్ (25) కీలక పాత్ర పోషించారు.


ఇవి కూడా చదవండి:

తొలి ఆసియా వికెట్‌కీపర్‌గా చరిత్ర సృష్టించిన పంత్

మోతెక్కించారు

Updated Date - Nov 22 , 2026 | 08:12 AM