గణేశ్ ‘డబుల్’
ABN , Publish Date - Nov 22 , 2026 | 06:43 AM
తెలుగు యువ ఆర్చర్ గణేశ్ మణిరత్నం తిరుమూరు ఆసియా కప్ ఆర్చరీ ర్యాంకింగ్ మీట్‌లో అదరగొట్టాడు. ఈ టోర్నీలో రెండు రజత పతకాలు...
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో నేడు
భారత్ ‘ఎ’ X పాకిస్థాన్ ‘ఎ’
(మ. 3.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో)
ఆసియా కప్ ఆర్చరీలో రెండు పతకాలు
హాంగ్జౌ (చైనా): తెలుగు యువ ఆర్చర్ గణేశ్ మణిరత్నం తిరుమూరు ఆసియా కప్ ఆర్చరీ ర్యాంకింగ్ మీట్‌లో అదరగొట్టాడు. ఈ టోర్నీలో రెండు రజత పతకాలు నెగ్గి ‘డబుల్’ సాధించాడు. ఇక, మహిళా ఆర్చర్ ఆదితి స్వామి కూడా టోర్నీలో రెండు పతకాలతో ‘డబుల్’ దక్కించుకుంది. ఓవరాల్‌గా భారత ఆర్చర్లు 3 రజతాలు, 3 కాంస్యాలతో ఆరు పతకాలు సొంతం చేసుకున్నారు. వీటిలో ఐదు పతకాలు కాంపౌండ్ ఆర్చర్లు నెగ్గగా, ఒక్కటి మాత్రమే రికర్వ్ విభాగంలో రావడం గమనార్హం. నెల్లూరుకు చెందిన 20 ఏళ్ల గణేశ్ కాంపౌండ్ పురుషుల వ్యక్తిగత ఈవెంట్ ఫైనల్లో 146-148తో బెయిలీ వైల్డ్‌మాన్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓటమిపాలై రజతం అందుకున్నాడు. ఇక, కాంపౌండ్ పురుషుల టీమ్ ఈవెంట్ ఫైనల్లో గణేశ్, మానవ్ మోహిత్‌లతో కూడిన భారత జట్టు 229-234తో ఆస్ట్రేలియా త్రయం చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఇక, మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో చైనా ఆర్చర్ చేతిలో ఓడి రజతం అందుకున్న అదితి.. టీమ్ ఈవెంట్ ప్లేఆఫ్స్ పోరులో ప్రీతికా ప్రదీప్, తేజల్ సాల్వేతో కలిసి కాంస్యం సాధించింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో ప్రీతిక కాంస్యం నెగ్గింది. రికర్వ్ పురుషుల టీమ్ ఈవెంట్‌లో ఉజ్వల్, గోల్డీ మిశ్రా, అభ్యుదయ్‌లతో కూడిన భారత బృందం కాంస్యం సొంతం చేసుకుంది.