ప్లేయర్లను మార్చినా.. పాకిస్థాన్‌కు తప్పని ఓటమి
ABN , Publish Date - Sep 12 , 2026 | 07:31 PM
ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ జట్టుకు వైట్‌వాష్ తప్పలేదు. తొలి రెండు టెస్టుల్లో ఓడిన పాకిస్థాన్‌కు చివరి టెస్టులో కూడా అదే ఫలితం రిపీట్ అయింది.
స్పోర్ట్స్ డెస్క్: ఇంగ్లండ్ గడ్డపై పాకిస్థాన్ జట్టుకు వైట్‌వాష్ తప్పలేదు. మూడు టెస్టుల సిరీస్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా ఓడిన పాక్.. ప్లేయర్లను మార్చిన రాత మారలేదు. మూడో టెస్టులో గెలిచి పరువు కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తొలగించి.. కొత్తవారిని తీసుకుంది. హెడ్ కోచ్, బౌలింగ్ కోచ్‌లపై కూడా వేటు వేసింది. అయినా మళ్లీ పరాభవమే ఎదురైంది.
ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో జరిగిన మూడో టెస్టులో పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఇంగ్లండ్ 453 పరుగులు చేసింది. ఇక పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో కాస్త పోరాడి 449 పరుగులు చేసింది. ఓటమి నుంచి తప్పించుకుని 129 పరుగుల ఆధిక్యాన్ని సాధించిన పాకిస్థాన్.. మ్యాచ్‌ను నాలుగో రోజుకు తీసుకెళ్లింది.
130 పరుగుల లక్ష్యంతో శనివారం ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి 24.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు బెన్ డకెట్, ఎమిలియో గే.. ఇద్దరూ డకౌట్ అయినా జోర్డాన్ కాక్స్ (59*), కెప్టెన్ జో రూట్ (62*) అర్ధ శతకాలతో జట్టును గెలిపించారు. డాన్ లారెన్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు, ఓలీ రాబిన్సన్, మహమ్మద్ అబ్బాస్‌లకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు దక్కాయి.
ఇవి కూడా చదవండి:
15 ఏళ్ల క్రితం నాటి సచిన్ ఔట్‌పై కామెంట్.. నెట్టింట పాక్ క్రికెటర్ నవ్వులపాలు!
సచిన్ రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్