Share News

గావస్కర్, కోహ్లీ సరసన జింబాబ్వే కెప్టెన్

ABN , Publish Date - Nov 06 , 2026 | 02:46 PM

అఫ్గానిస్థాన్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో జింబాబ్వే బ్యాట‌ర్లు శ‌త‌కాల‌తో చెల‌రేగుతున్నారు. ఇప్ప‌టికే బ్రెండ‌న్ టేల‌ర్ (131) సెంచ‌రీ చేయ‌గా, తాజాగా కెప్టెన్ బ్రియాన్ బెన్నెట్ కూడా అజేయ శ‌త‌కం(128)తో రాణించాడు.

గావస్కర్, కోహ్లీ సరసన జింబాబ్వే కెప్టెన్
Brian Bennett

స్పోర్ట్స్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టులో జింబాబ్వే బ్యాట‌ర్లు శ‌త‌కాల‌తో చెల‌రేగుతున్నారు. ఇప్ప‌టికే బ్రెండ‌న్ టేల‌ర్ (131) సెంచ‌రీ చేయ‌గా, తాజాగా కెప్టెన్ బ్రియాన్ బెన్నెట్ కూడా అజేయ శ‌త‌కం(128)తో రాణించాడు. త‌ద్వారా జింబాబ్వే 400 ప‌రుగుల మార్క్‌ను దాటి భారీ స్కోరు దిశ‌గా వెళ్తోంది. రెండో రోజు ఆటలో సెంచరీ బాదిన కెప్టెన్ బెన్నెట్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాక టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సరసన బెన్నెట్ నిలిచాడు


టెస్టుల్లో కెప్టెన్‌గా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న తొలి మ్యాచ్‌లోనే సెంచ‌రీ బాదిన ఆట‌గాళ్ల జాబితాలో బ్రియాన్ బెన్నెట్ చోటు సంపాదించాడు. ఇప్ప‌టివ‌ర‌కు 35 మంది ప్లేయ‌ర్లు ఈ రికార్డు సాధించారు. కోహ్లీ, విజ‌య్ హ‌జారే, గావ‌స్క‌ర్‌, గిల్ వంటి దిగ్గ‌జాల స‌ర‌స‌న బ్రియాన్ నిలిచాడు. ఇందులో విరాట్ కోహ్లీ, గ్రెగ్ చాపెల్ మాత్రం కెప్టెన్ బాధ్యతలు తీసుకున్న తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచ‌రీలు బాదిన క్రికెట‌ర్లుగా రికార్డుల‌కెక్కారు. అయితే జింబాబ్వే త‌ర‌ఫున కెప్టెన్‌గా డెబ్యూ సెంచ‌రీ బాదిన నాలుగో ప్లేయ‌ర్‌గా బ్రియాన్ బెన్నెట్ నిలిచాడు. గ‌తంలో 1992లో డీఎల్ హూగ్‌ట‌న్ (121 ప‌రుగులు) , 2011లో బ్రెండ‌న్ టేల‌ర్ (105 నాటౌట్ ), 2020లో బంగ్లాదేశ్‌తో టెస్టులో క్రెయిగ్ ఎర్విన్ (107) సెంచ‌రీలు బాదారు.


ఇవి కూడా చదవండి

మీర్‌పేట్ డబుల్ మర్డర్ కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్

లాస్ ఏంజెలెస్ సిటీ అటార్నీగా భారత సంతతి మహిళ..

పొత్తు లేకపోతే అన్ని స్థానాల్లో పోటీ చేస్తాము: చిరాగ్ పాశ్వాన్‌

Updated Date - Nov 06 , 2026 | 02:58 PM