పాక్ ప్లేయర్లే కాదు.. ఆ దేశ అంపైర్లు కూడా ఓవరాక్షనే.. ఈ వీడియోనే సాక్ష్యం!
ABN , Publish Date - Nov 22 , 2026 | 01:00 PM
ఇటీవల జరిగిన అంధుల క్రికెట్‌లో అన్యాయంగా కప్పును తీసుకొని పాకిస్థాన్ విమర్శలపాలైంది. అంతేకాకుండా ఆ జట్టుతో పాటు అంపైర్ కూడా సంబరాలు చేసుకోవడంతో మరింత దుమారం రేగుతోంది.
స్పోర్ట్స్ డెస్క్: సాధారణంగా ఓవరాక్షన్‌కు పెట్టింది పేరు పాకిస్థాన్ ఆటగాళ్లు. ఏ క్రీడలో అయిన వారు అతిగా ప్రవర్తిస్తుంటారు. అది క్రికెట్‌లో కాస్తా ఎక్కువగా ఉంటుంది. ఇలా పాక్ ప్లేయర్లే ఓవరాక్షన్ చేస్తారనుకుంటే.. వారి జాబితాలో చేరాడు.. ఆ దేశ అంపైర్. ఇటీవల జరిగిన అంధుల క్రికెట్ ఆసియా కప్ 2026 ఫైనల్ మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. వారితో సంబరాల్లో పాల్గొన్న అంపైర్ ఒకరు.. భారత్‌ను రెచ్చగొట్టేలా జెట్ క్రాష్ సంకేతం చూపాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడయాలో వైరల్ అవుతోంది.
అంధుల క్రికెట్ ఆసియా కప్ 2026 ఢాకా వేదికగా జరిగింది. ఫైనల్ వర్షం కారణంగా రద్దు అయినా.. ఇరు జట్లనూ సంయుక్త విజేతలుగా ప్రకటించలేదు. నెట్‌రన్‌రేట్ కారణంగా పాక్ విజేతగా ప్రకటించారు. టోర్నీ నిర్వాహకులు తీసుకున్న నిర్ణయం సరైనది కాదంటూ ఈ ట్రోఫీ ప్రజెంటేషన్‌ను భారత్ బహిష్కరించింది. మరోవైపు ఇండియాపై ఏ స్థాయిలో గెలిచిన పాకిస్థాన్ సంతోషానికి హద్దులు ఉండవు. అలానే అంధుల క్రికెట్‌లో కూడా ఆసియా కప్ 2026 టైటిల్ గెలవడంతో సంబరాలు చేసుకున్నారు.
ఏదైనా మ్యాచ్ లేదా టోర్నీలో విజేతగా నిలిస్తే ప్లేయర్లు సంబరాలు చేసుకోవడం షరామామూలే. అంపైర్లు కేవలం ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపి పక్కకు వచ్చేస్తారు. కానీ, చెందిన అంపైర్ చేసిన హడావుడి ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. తమ జట్టుకు కప్ దక్కినందుకు ‘ఫ్లైట్ క్రాష్’ సంబరాలు చేసుకోవడం విస్మయానికి గురి చేసింది. దీనిపైనా భారత అంధుల క్రికెట్ సంఘం (CABI) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ఆసియా కప్ మొత్తం అంపైరింగ్ చేసిన అతడు.. పాక్ జట్టుతో కలిసి ఎలా సంబరాలు చేసుకుంటారు?. అంపైర్లు తటస్థంగా ఉండాలనే నిబంధనలనూ బేఖాతరు చేశారు’ అంటూ మండిపడింది.
ఇవి కూడా చదవండి:
టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. మూడో బౌలర్‌గా
పంత్ శతకంపై హర్షం వ్యక్తం చేసిన గావస్కర్.. వీడియో వైరల్!