Share News

బీసీసీఐకి షాక్.. సెలక్టర్ పదవిని తిరస్కరించిన ఇద్దరు మాజీ క్రికెటర్లు!

ABN , Publish Date - Oct 15 , 2026 | 03:02 PM

బీసీసీఐ నుంచి ఏదైనా పదవి ఆఫర్ వచ్చిందంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. ఎందుకో గానీ, ఈసారి మాత్రం కొన్ని కీలక పదవులపై పెద్దగా ఆసక్తి కన్పించట్లేదు.

బీసీసీఐకి షాక్.. సెలక్టర్ పదవిని తిరస్కరించిన ఇద్దరు మాజీ క్రికెటర్లు!
BCCI Selector Post

ఇంటర్నెట్ డెస్క్‌: క్రికెట్ ప్రపంచంలో అత్యంత సంపద కలిగిన బోర్డులో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఒకటి. ఈ బోర్డు నుంచి ఏదైనా పదవి ఆఫర్ వస్తే.. కాదనే వారు ఉండరు. బీసీసీఐ నుంచి ఏదైనా పదవి ఆఫర్ వచ్చిందంటే ఎగిరి గంతేస్తారు. ఈసారి మాత్రం సెలక్టర్ పదవుల విషయంలో గతానికి పూర్తి భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పదవులపై ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఓ ఇద్దరు మాజీలైతే ఏకంగా తమ వద్దకు వచ్చిన ఆఫర్‌ను కూడా తిరస్కరించారని సమాచారం. వారిద్దరికి దాదాపు వందకుపైగా టెస్టులు ఆడిన అనుభవం ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే...


ఇప్పటి వరకు టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌గా పనిచేసిన అజిత్ అగార్కర్ (Ajit Agarkar) పదవీ కాలం అక్టోబర్ 4తో ముగిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం భారత మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా సెలక్షన్ కమిటీకి తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత ప్యానెల్‌లో శివ్ సుందర్ దాస్, అజయ్ రాత్రా, ఆర్‌పి సింగ్ కూడా ఉన్నారు. మరోవైపు బీసీసీఐ (BCCI) వెస్ట్ జోన్ నుంచి సెలక్టర్ పదవి కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. అక్టోబర్ 14తో గడువు ముగిసింది. రమేశ్‌ పొవార్, సమీర్ దిఘే మాత్రమే అప్లై చేసుకున్నారు. టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్‌ దరఖాస్తు చేసుకుంటే.. అతడే చీఫ్‌ సెలక్టర్‌గా ఎంపికయ్యేవాడు. కానీ, అతడు ఆసక్తి చూపించలేదు.


దీంతో తాత్కాలిక చీఫ్ సెలక్టర్ ఉన్న ప్రజ్ఞాన్ ఓజా.. ఆ పదవిలో పూర్తిస్థాయిలో నియమితుడు కావడం ఖాయమేనని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. సెలక్టర్ల జీత భత్యాల విషయానికి వస్తే.. దశాబ్దన్నర కిందటి వరకూ ఎక్కువగా ఉండేవి కావు. కానీ, ఎంపిక కమిటీ బడ్జెట్‌ను బీసీసీఐ భారీగా పెంచింది. పెద్ద మొత్తంలోనే వేతనాలను చెల్లిస్తోంది. మొన్నటి వరకూ ఆ బడ్జెట్ రూ.17.45 కోట్లు ఉండగా.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి దాన్ని రూ.19.35 కోట్లకు పెంచింది. చీఫ్ సెలక్టర్‌గా పనిచేసే వారికి ఏడాదికి రూ.3 కోట్ల వరకూ అందనుంది. భారీ మొత్తంలో వేతనం వస్తున్న.. ఈ పదవులు ఆఫర్‌ను మాజీ క్రికెటర్లు తిరస్కరించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

కిరణ్ వెంకట పల్లా మృతిపై గ్లోబల్ ఎన్నారై టీడీపీ చీఫ్ డాక్టర్ రాజా సంతాపం

సెయింట్ లూయిస్‌లో ఘనంగా తానా టీమ్ స్క్వేర్ 5కే రన్

Updated Date - Oct 15 , 2026 | 03:08 PM