Share News

సెయింట్ లూయిస్‌లో ఘనంగా తానా టీమ్ స్క్వేర్ 5కే రన్

ABN , Publish Date - Oct 12 , 2026 | 09:24 PM

అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో తానా (TANA) టీమ్ స్క్వేర్ ఆధ్వర్యంలో 5K వాక్/రన్ కార్యక్రమం నిర్వహించారు. సామాజిక సేవే లక్ష్యంగా, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు ఈ రన్ నిర్వహించారు.

సెయింట్ లూయిస్‌లో ఘనంగా తానా టీమ్ స్క్వేర్ 5కే రన్

వాషింగ్టన్: అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో తానా (TANA) టీమ్ స్క్వేర్ ఆధ్వర్యంలో 5K వాక్/రన్ కార్యక్రమం నిర్వహించారు. సామాజిక సేవే లక్ష్యంగా, ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు ఈ రన్ నిర్వహించారు. దాదాపు 200 మంది తెలుగు వారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


TANA-Run1.jpgఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్ ట్రస్టీ రాజా సూరపనేని, తానా రీజినల్ కో ఆర్డినేటర్ రవి పొట్ల, తానా మహిళా కోఆర్డినేటర్ పల్లవి సూరపనేని, ఎన్నారై టీడీపీ (NRI TDP) గ్లోబల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ చెంచు వేణుగోపాల్ రెడ్డి, ఎన్నారై టీడీపీ సెయింట్ లూయిస్ ప్రెసిడెంట్ కిషోర్ యార్లగడ్డ, ఏపీఎన్నార్టీ (APNRT) కో ఆర్డినేటర్ కిషోర్ యర్రపోతిన తదితర పాల్గొన్నారు.


TANA-Run2.jpgఅలాగే సెయింట్ లూయిస్ టీడీపీ నాయకులు, తెలుగు కమ్యూనిటీ సభ్యులు వంశీ పాతూరి, వీర, సుధాకర్, నాగకుమార్ బెల్లంకొండ, వెంకట్ గౌని, రాకేష్ మద్దినేని, ప్రదీప్ నంద్యాల, సుధాకర్ నర్రా, దామోదర్ పాతూరి, వెంకట్ ఉపమాకతో పాటు పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు, చిన్నారులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


TANA-Run3.jpgచిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా సుమారు 200 మంది పాల్గొనడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ, సామాజిక బాధ్యతను చాటుతూ టీమ్ స్క్వేర్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి తెలుగు సమాజం నుంచి విశేష స్పందన లభించింది.


TANA-Run4.jpgతెలుగు ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడం వంటి గొప్ప లక్ష్యాలతో నిర్వహించిన ఈ 5K వాక్/రన్ కార్యక్రమం అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన తానా టీమ్ స్క్వేర్ నిర్వాహకులకు, వాలంటీర్లకు, సహకరించిన నాయకులతోపాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.


మరిన్ని వార్తలు చదవండి..

సౌదీలో కొలువుదీరిన సాటా కొత్త కార్యవర్గం

అమెరికాలో కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎం.ఎ. గఫూర్ పెద్ద కుమారుడి ఆకస్మిక మృతి

Updated Date - Oct 12 , 2026 | 09:42 PM