సౌదీలో కొలువుదీరిన సాటా కొత్త కార్యవర్గం
ABN , Publish Date - Oct 10 , 2026 | 09:31 PM
సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీయుల క్రియాశీలక సంఘమైన ‘సాటా’లో నూతన పాలకవర్గం కొలువుదీరింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: సౌదీ అరేబియాలోని తెలుగు ప్రవాసీయుల క్రియాశీలక సంఘమైన ‘సాటా’లో నూతన పాలకవర్గం కొలువుదీరింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఎన్నికలలో అధ్యక్షుడిగా రంజీత్ చిత్తలూరి, ఉపాధ్యక్షుడిగా ముజ్జమ్మీల్ షేఖ్, ప్రధాన కార్యదర్శిగా ఎర్రన్న దుగ్గరపు, సంయుక్త కార్యదర్శిగా నాగార్జున, కోశాధికారిగా వెంకట రావు గుత్తా ఎన్నికయ్యారు.
ఐదుగురు సభ్యులతో కూడిన ఎన్నికల కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికలను పారదర్శకతతో నిర్వహించినట్లుగా ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఆనందరాజు గుండుబోగుల ఒక ప్రకటనలో తెలిపారు.
అదే విధంగా, మహిళా విభాగం అధ్యక్షురాలిగా సుచరిత, మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా మాధవిబాలు, ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకలు ఎన్నికయ్యారని కూడా ఆనందరాజు వెల్లడించారు. సేవా విభాగానికి పోకూరి ఆనంద్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారని కూడా ఎన్నికల కమిటీ ప్రకటించింది.
బలమైన అభ్యర్థులు కొందరు స్ధానికంగా సత్తా చూపినా ఆన్‌లైన్ పోలింగ్ విధానంలో ఓట్లు రాబట్టలేక అనూహ్యంగా ఓటమి పాలయ్యారు.
ఈ వార్తలనూ చదవండి:
కెనడా మేయర్ రేసులో తెలుగు మహిళ
చదువుల బాటలో విద్యార్థులకు తానా చేయూత.. స్కూల్ బ్యాగులు, విద్యా సామగ్రి పంపిణీ