చదువుల బాటలో విద్యార్థులకు తానా చేయూత.. స్కూల్ బ్యాగులు, విద్యా సామగ్రి పంపిణీ
ABN , Publish Date - Oct 08 , 2026 | 08:45 PM
స్కూల్ పిల్లలకోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్-అట్లాంటిక్ విభాగం నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది.
ఇంటర్నెట్ డెస్క్: స్కూల్ పిల్లలకోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్-అట్లాంటిక్ విభాగం నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది. స్థానిక కమ్యూనిటీకి సహాయం చేసేందుకు తానా ప్రతిఏటా ‘గివింగ్ బ్యాక్ టు ది కమ్యూనిటీ’ పేరుతో కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. స్కూల్ పిల్లలకు అవసరమైన బ్యాగ్, ఇతర వస్తువులను అందజేస్తోంది. ఈ సంవత్సరం ఈ ‘గివింగ్ బ్యాక్ టు ది కమ్యూనిటీ’లో భాగంగా హ్యారీస్‌బర్గ్‌లోని డౌనీ స్కూల్ విద్యార్థులకు బ్యాగులు, వస్తువులను విరాళంగా అందించింది. నూతన విద్యా సంవత్సరాన్ని ఆనందంగా ప్రారంభించాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సేవా కార్యక్రమానికి నాయకత్వం వహించి, మద్దతు అందించిన తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, తానా బోర్డ్ డైరెక్టర్ రవి పొట్లూరికి మిడ్ అట్లాంటిక్ విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.
తానా ఈవీపీ శ్రీనివాస్ లావు, కమ్యూనిటీ సర్వీస్ కోఆర్డినేటర్ సాయి బొల్లినేని, తానా బెనిఫిట్స్ కోఆర్డినేటర్ వెంకట్ సింగు, తానా మిడ్-అట్లాంటిక్ రీజినల్ రిప్రజెంటేటివ్ ఫణి కంతేటి ఈ కార్యక్రమం విజయవంతమయ్యేలా కృషి చేశారు. ఈ కార్యక్రమానికి తోడ్పడిన వలంటీర్లను నిర్వాహకులు అభినందించారు. ఆర్థిక సహాయం అందించిన గ్రాండ్ స్పాన్సర్లు షిన్‌టెక్ ఇంక్, బ్రైట్ రేట్ మోర్ట్‌గేజ్ ఎల్ఎల్‌సిలకు ధన్యవాదాలు తెలిపారు.



ఈ వార్తలూ చదవండి
ఓటర్ల ప్రధాన సమస్యలేంటో నాకు తెలియదు: ట్రంప్
రష్యాలో ప్లేగు వ్యాధి భయాలు.. స్పందించిన ట్రంప్