దసరా వేళ ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. ప్రత్యేక బస్సులకు గ్రీన్‌సిగ్నల్..
ABN , Publish Date - Oct 08 , 2026 | 08:31 PM
దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ వేళ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 16 నుంచి 25వ తేదీ వరకు మొత్తం 5,261 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది.
అమరావతి: దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ వేళ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 16 నుంచి 25వ తేదీ వరకు మొత్తం 5,261 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది. దసరా సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ఏపీఎస్‌ఆర్టీసీ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది.
ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన నగరాలు, ప్రాంతాలకు అనుగుణంగా ప్రత్యేక సర్వీసులను తీసుకురానున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్‌కు అత్యధికంగా 1,186 ప్రత్యేక బస్సులు కేటాయించగా.. బెంగళూరుకు 475, విశాఖపట్నానికి 440, రాజమహేంద్రవరానికి 347 బస్సులను నడపనున్నారు. ఇక, తిరుపతికి 247, చెన్నైకి 153 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. దసరా సందర్భంగా స్వస్థలాలకు వెళ్లే వారు, పండగ అనంతరం తిరిగి తమ గమ్యస్థానాలకు చేరుకునే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అధికారులు ఈ ప్రత్యేక సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
గుడ్ న్యూస్.. దసరా వేళ దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్..
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..