గుడ్ న్యూస్.. దసరా వేళ దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్..
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:52 PM
దసరా పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
అమరావతి: దసరా పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గాపూజ నిర్వాహకులకు శుభవార్త తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా దుర్గాదేవి మండపాలకు ఉచిత విద్యుత్ (Free Electricity) సరఫరా చేయనున్నట్లు మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ఆయన వివరాలను వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా అనుమతి పొందిన దుర్గాదేవి మండపాలకు ఈ ఉచిత విద్యుత్ సదుపాయం వర్తించనున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 కిలోవాట్లు, పట్టణ ప్రాంతాల్లో 5 కిలోవాట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు. దుర్గామాత దివ్య స్ఫూర్తిని స్మరించుకుంటూ సమాజమంతా కలిసి పండుగను జరుపుకుంటున్న వేళ.. ప్రభుత్వం తరఫున ఈ సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా దుర్గాపూజ నిర్వాహకులు, ఏపీ ప్రజలకు మంత్రి లోకేశ్ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్‌కు పోటెత్తిన వినతులు..
ఏపీ పోర్టుల అభివృద్ధిపై మహారాష్ట్ర మంత్రి ప్రశంసలు.. ల్యాండ్ లార్డ్ మోడల్‌పై ఆసక్తి