ముగిసిన అజిత్ అగార్కర్ పదవీ కాలం.. దరఖాస్తులను ఆహ్వానిస్తున్న బీసీసీఐ
ABN , Publish Date - Oct 06 , 2026 | 09:37 PM
టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ పదవీ కాలం ముగిసింది. ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఆయన స్థానాన్ని భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఈరోజు (మంగళవారం) ప్రకటన చేసింది. కాగా అజిత్ అగార్కర్ పదవీ కాలం అక్టోబర్ 4తో ముగిసింది. ప్రస్తుతం భారత్ మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా తాత్కాలిక ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ కీలక ప్రకటన జారీ చేసింది
‘మెన్స్ సెలక్షన్ కమిటీలో ఒక సభ్యుడి స్థానాన్ని భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాం’ అని బీసీసీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఈ సభ్యుడిపైనే క్రీడాకారుల సెలక్షన్ ప్రక్రియ ఆధారపడి ఉంటుందని వెల్లడించింది. అలాగే సెలక్షన్ కమిటీలో సభ్యుడి బాధ్యతలు, అర్హతలు తెలిపింది.
సభ్యుడి బాధ్యతలు ఇవే
న్యాయంగా , పారదర్శకంగా క్రీడాకారులను ఎంచుకుని ఉత్తమ జట్టును తీర్చిదిద్దాలి.
టీమ్ మీటింగ్స్‌కు హాజరు కావాలి. అవసరమైనప్పుడు మ్యాచ్‌లు వీక్షించేందుకు విదేశి ప్రయాణాలు చేయాలి.
మీడియా సమావేశాల్లో పాల్గొనాలి.
మూడు ఫార్మట్ల కెప్టెన్‌లను నియమించాలి.
అర్హతలు.. అనుభవాలు
కనీసం ఏడు టెస్ట్ మ్యాచ్‌లు లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి. లేకపోతే 10 వన్డేలు ఆడినా సరిపోతుంది.
5 ఏళ్ల క్రితమే రిటైరై ఉండాలి
ఈ వార్తలూ చదవండి
విండీస్ 171 పరుగులకు ఆలౌట్.. భారత్ లక్ష్యం 172..
వైభవ్‌తో బ్యాటింగ్ చేస్తే ఒత్తిడే ఉండదు: ప్రియాంశ్ ఆర్య