అక్తర్ రికార్డును బ్రేక్ చేస్తాను.. టీమిండియా బౌలర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 08 , 2026 | 07:35 PM
టీమిండియా రైజింగ్ స్టార్, గుజరాత్ టైటాన్స్ పేసర్ అశోక్ శర్మ అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ప్రపంచ రికార్డును బద్దలు కొడుతానంటూ శపథం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 161.3 కి.మీ వేగంతో అక్తర్ విసిరిన బంతి రికార్డు ఇప్పటికీ అతడి పేరిటనే ఉంది.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా రైజింగ్ స్టార్, గుజరాత్ టైటాన్స్ పేసర్ అశోక్ శర్మ అసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ప్రపంచ రికార్డును బద్దలు కొడుతానంటూ శపథం చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 161.3 కి.మీ వేగంతో అక్తర్ విసిరిన బంతి రికార్డు ఇప్పటికీ అతడి పేరిటనే ఉంది. తాజాగా అక్తర్ రికార్డును బ్రేక్ చేస్తానంటూ అశోక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశోక్ శర్మ మాట్లాడుతూ.. ‘ఏదో ఒకరోజు అక్తర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాలనే సంకల్పంతోనే ఉన్నాను. బౌలింగ్ వేగం విషయంలో మాత్రం ఎన్నటికీ రాజీపడను. నా దృష్టి ఎప్పుడూ కూడా బౌలింగ్‌ను మెరుగుపరుచుకోవడంపైనే ఉంటుంది. అంతా బాగుంటే, ఏదో ఒక రోజు అక్తర్ నెలకొల్పిన 161 కి.మీ వేగాన్ని అందుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో నన్ను నేను మెరుగుపరచుకునేందుకు మరింత కష్టపడుతాను. అయితే నా బౌలింగ్‌ను మెరుగుపరచుకునే క్రమంలో ఆరోగ్యకరమైన పోటీ ఉండడాన్ని ఇష్టపడుతాను’ అని చెప్పుకొచ్చాడు.
ఇక అశోక్ శర్మ విషయానికి వస్తే... ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడిన అశోక్ శర్మ ఒక మ్యాచ్‌లో 154.2 కి.మీ వేగంతో (గంటకు 95.8 మైళ్ల వేగం) బంతి విసిరి ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన డెలివరీతో రికార్డు సృష్టించాడు. అంతకముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2025 సీజన్‌లో 22 వికెట్లు తీయడమే గాక ప్రతీ మ్యాచ్‌లో దాదాపు 150 కి.మీ వేగంతో స్థిరంగా బంతులు వేయడం విశేషం. ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ తరఫున 6 మ్యాచ్‌లాడిన అశోక్ ఆరు వికెట్లు మాత్రమే తీశాడు. మరోవైపు భవిష్యత్ మ్యాచుల్లో ఒకవేళ టీమిండియాలో అవకాశం ఇవ్వాలనుకుంటే అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రానా, బుమ్రా వంటి స్టార్ పేస్లరకు పని భారాన్ని తగ్గించే క్రమంలో అశోక్ శర్మ ఉపయోగపడగలడు.
అక్తర్ ప్రపంచ రికార్డు
వన్డే ప్రపంచకప్ 2023లో రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ అత్యంత వేగవంతమైన బంతిని విసిరాడు. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో నిక్ నైట్‌కు (గంటకు 161.3 కి.మీ వేగంతో) బంతిని విసిరాడు. గంటకు 100 మైళ్ల వేగంతో విసిరడంతో అక్తర్ పేరు క్రికెట్ పుస్తకాల్లో నిలిచిపోయింది. ఇప్పటికే ఆ రికార్డును ఏ బౌలర్ బ్రేక్ చేయలేదు. ఆసీస్ స్పీడస్టర్లు బ్రెట్ లీ(161.1కి.మీ), షాన్ టైట్(160.7 కి.మీ, 161.1 కి.మీ)లు అక్తర్ రికార్డుకు దగ్గరగా వచ్చి ఆగిపోయారు.
ఇవి కూడా చదవండి:
ఫిఫా 2026: క్వార్టర్ ఫైనల్స్‌కు లైన్ క్లియర్.. షెడ్యూల్ ఇదే!
ఫిఫా ప్రపంచకప్‌లో యూఎస్ వ్యూహాలపై ఇరాన్ ఘాటు విమర్శలు!