Share News

ఫిఫా ప్రపంచకప్‌లో యూఎస్ వ్యూహాలపై ఇరాన్ ఘాటు విమర్శలు!

ABN , Publish Date - Jul 08 , 2026 | 05:37 PM

ఫిఫా ప్రపంచ కప్ 2026కు అమెరికా ఆతిథ్యం ఇవ్వడంపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ షెజెష్కియన్ విమర్శలు గుప్పించారు. అడ్డంకులు సృష్టించడం, మోసం చేయడమే యూఎస్ వ్యూహమని ఆయన పేర్కొన్నారు.

ఫిఫా ప్రపంచకప్‌లో యూఎస్ వ్యూహాలపై ఇరాన్ ఘాటు విమర్శలు!
FIFA World Cup 2026

స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్ 2026కు అమెరికా ఆతిథ్యం ఇవ్వడంపై ఇరాన్ అధ్యక్షుడు మసూద్ షెజెష్కియన్ విమర్శలు గుప్పించారు. ఫిఫా వరల్డ్ కప్‌లో యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ జోక్యం చేసుకున్నారంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇరాన్ సైతం పలు ఆరోపణలు చేసింది. ఫిఫా ప్రపంచ కప్‌లో అమెరికా నిబంధనలను ఉల్లంఘింస్తోందని, ప్రత్యర్థులను బెదిరిస్తోందని, మోసం చేస్తోందని మసూద్ షెజెష్కియన్ ఆరోపించారు. ప్రపంచ కప్ ఆతిథ్య దేశంగా ఉన్న అమెరికా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని అన్నారు. అడ్డంకులు సృష్టించడం, మోసం చేయడమే వారి వ్యూహమని ఆయన పేర్కొన్నారు.


ఇరాన్ ఇటువంటి మోసపూరిత ఆటలను తిరస్కరిస్తుందని, తాము హక్కుల కోసం దృఢంగా నిలబడతామని, అసరమైతే పోరాడతామని పెజెష్కియన్ ఎక్స్ లో రాసుకొచ్చారు. రౌండ్ ఆఫ్ 16లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా చేతిలో ఈజిప్ట్ 3-2 తేడాతో నాటకీయంగా ఓడిపోయిన తర్వాత మసూద్ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ జట్టు రెండు గోల్స్ ఆధిక్యాన్ని చేజార్చుకున్న తర్వాత, అర్జెంటీనాకు, అలానే కెప్టెన్ లియోనెల్ మెస్సీకి ఫీఫా అనుకూలంగా వ్యవహరిస్తోందని ఈజిప్ట్ హెడ్ కోచ్ హోసామ్ హసన్ ఆరోపించిన సంగతి తెలిసిందే.


మైదానంలో జరిగిన గొడవ సమీక్ష తర్వాత, రెండవ అర్ధభాగంలో మోస్తఫా జికో చేసిన గోల్‌ను అంపైర్ తిరస్కరించాడు. ఆ నిర్ణయం మ్యాచ్‌లో అత్యంత చర్చనీయాంశమైన విషయాల్లో ఒకటిగా నిలిచింది. బెల్జియంతో జరిగే మ్యాచ్‌కు ముందు, యూఎస్ ఫార్వర్డ్ ఫోలారిన్ బలోగన్‌కు చూపిన రెడ్ కార్డ్, ఫలితంగా ఒక మ్యాచ్ నిషేధం పడింది. దీనిపై సమీక్షించాలని తాను ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినోతో మాట్లాడినట్లు ట్రంప్ 'ట్రూత్ సోషల్'లో పోస్ట్ చేసిన మరో సంఘటన నేపథ్యంలో ఇవాళ అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో ఈజిప్ట్ వివాదం తలెత్తింది.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానాల్లో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ

గౌతమ్ గంభీర్ నిర్ణయంపై దినేష్ కార్తిక్ విమర్శలు

Updated Date - Jul 08 , 2026 | 05:37 PM