Share News

4 వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌కు కాదు.. 2 వికెట్లతో అన్షుల్ కాంబోజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్!

ABN , Publish Date - Nov 04 , 2026 | 09:46 PM

ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్, అర్ధ శతక రాణించిన విరాట్ కోహ్లీ(74)లకు కాకుండా రెండు వికెట్లు తీసిన అన్షుల్ కాంబోజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.

4 వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌కు కాదు.. 2 వికెట్లతో అన్షుల్ కాంబోజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్!
Anshul Kamboj

స్పోర్ట్స్ డెస్క్: ఇటీవల న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా.. ఇవాళ్టి నుంచి ప్రారంభమైన ఐదు వన్డేల సిరీస్‌ను కూడా ఘనంగా ప్రారంభించింది. బుధవారం ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ డక్‌వర్త్ లూయిస్ ప్రకారం ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది. వర్షం అంతరాయం కలిగించడంతో టీమిండియా టార్గెట్ 32 ఓవర్లలో 143 పరుగులకు కుదించారు. ఈ లక్ష్యాన్ని భారత్ 22.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.


ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్, అర్ధ శతక రాణించిన విరాట్ కోహ్లీ(74)లకు కాకుండా రెండు వికెట్లు తీసిన అన్షుల్ కాంబోజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. దీనిపై పలువురు క్రికెటర్లు సందేహం వ్యక్తం చేశారు. అన్షుల్ కాంబోజ్ రెండు వికెట్లే తీసినప్పటికీ మ్యాచ్‌పై ఎక్కువ ప్రభావం చూపాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసిన అతడు 2.20 ఎకానమీతో 22 పరుగులే ఇచ్చాడు.


కాంబోజ్ కట్టడిగా బౌలింగ్ చేయడంతోనే కివీస్ బ్యాటర్లకు ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలో అతడి కాకపోయినా ఇతర బౌలర్లకు వికెట్లు దక్కాయి. ఇక అర్ష్‌దీప్ సింగ్ విషయానికి వస్తే.. అతడు నాలుగు వికెట్లు తీసినా.. ధారళంగా పరుగులిచ్చాడు. అన్షూల్ కాంబోజ్ ఒక్కడే కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. దాంతోనే అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.


ఇవి కూడా చదవండి:

WPL 2027 షెడ్యూల్ రిలీజ్.. తొలి మ్యాచ్ ముంబై వర్సెస్ ఆర్సీబీ

అర్ష్‌దీప్ సింగ్‌కు టెస్టుల్లోనూ అవకాశం ఇవ్వండి: గావస్కర్

సచిన్ టెండూల్కర్ రికార్డు బద్దలు.. కోహ్లీ సరికొత్త చరిత్ర!

Updated Date - Nov 04 , 2026 | 10:07 PM