Share News

చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. 21 ఏళ్ల తర్వాత ..

ABN , Publish Date - Jun 10 , 2026 | 02:43 PM

వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. 21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆస్ట్రేలియాపై వన్డే మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది.

చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. 21 ఏళ్ల తర్వాత ..
Bangladesh vs Australia

స్పోర్ట్స్ డెస్క్: వన్డే క్రికెట్‌లో బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. 21 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఆస్ట్రేలియాపై వన్డే మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నిన్న( మంగళవారం) ఢాకా వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ డక్‌వర్త్ లూయిస్ పద్దతి ద్వారా 86 పరుగుల తేడాతో కంగారు జట్టును ఓడించింది.


ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. మోసాడెక్ హోస్సేన్(86 నాటౌట్), నజ్ముల్ హొస్సేన్ షాంటో(67), తంజిద్ హసన్( 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు పడగొట్టాడు. లియామ్ స్కాట్, మ్యాట్ రేన్‌షా రెండేసి వికెట్లు సాధించారు. గ్జేవియర్ బార్ట్‌లెట్ ఒక వికెట్ పడగొట్టాడు.


అనంతరం 285 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా.. వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 42.2 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులే చేసింది. ఆ తర్వాత వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ ప్రకారం మ్యాచ్ ఫలితాన్ని తేల్చారు. 86 పరుగుల తేడాతో బంగ్లా విజయం సాధించింది. అలెక్స్ క్యారీ 47), కామెరూన్ గ్రీన్ ( 52 నాటౌట్), కూపర్ కనోల్లీ(35) మినహా అంతా విఫలమయ్యారు.


బంగ్లా బౌలర్లలో నహిద్ రాణా నాలుగు వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహ్మాన్, మొసాడెక్ హుస్సేన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. టస్కిన్ అహ్మద్ ఒక వికెట్ సాధించాడు. సొంతగడ్డపై వన్డే క్రికెట్‌లో ఆస్ట్రేలియాను ఓడించడం బంగ్లాదేశ్‌కు ఇదే తొలిసారి. 2005లో కార్టిఫ్‌లో జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్‌లో బంగ్లాదేశ్ తొలిసారిగా కంగారు జట్టుపై విజయం సాధించింది. సుమారు 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై రెండో విజయాన్ని నమోదు చేసింది.


ఇవి కూడా చదవండి:

ఇంగ్లండ్ ప్లేయర్లతో ఘర్షణ.. ఎవరీ రగ్బీ ప్లేయర్?

అదరగొట్టిన మెస్సి.. ఐస్‍లాండ్‌పై అర్జెంటీనా ఘన విజయం

Updated Date - Jun 10 , 2026 | 02:44 PM